రోజుకి 2 వాల్ నట్స్ తింటే ఏమి అవుతుందో తెలుసా…ముఖ్యంగా పిల్లలు…అసలు నమ్మలేరు
Walnuts Benefits In Telugu : ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితి దృష్ట్యా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకున్నారు. వాల్‌నట్స్ ని ప్రతి రోజు పిల్లలకు పెడితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. వాల్‌నట్స్ కాస్త ఖరీదు ఎక్కువైనా దానికి తగ్గట్టుగానే మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. .
ప్రతిరోజు రెండు వాల్‌నట్స్ ని రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిపై తొక్క తీసి పిల్లలకు పెడితే ఎన్నో లాభాలు కలుగుతాయి. పిల్లల యొక్క మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడటానికి మంచి పోషకాలు ఉన్న ఆహారం పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు వాల్‌నట్స్ పెడితే వాటిలో ఉండే పోషకాలు పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడతాయి.
వాల్‌నట్స్‌లో ఫోలేట్ మరియు ఒమేగా-3 సమృద్దిగా ఉండుట వలన పిల్లల మెదడు అభివృద్ధిలో సహాయపడటమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచడం మరియు మెదడు కణాల కార్యకలాపాలను పెంచడం ద్వారా మెదడు శక్తిని మెరుగుపరుస్తాయి. విటమిన్ బి1 మరియు బి6 అనేవి మెదడు కణజాల అభివృద్ధి మరియు పిల్లల నరాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
వాల్‌నట్స్‌లో మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, కాల్షియం, జింక్ మరియు సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. పిల్లల సరైన ఎదుగుదలకు ఇవి చాలా అవసరం. కాల్షియం ఎముకలను బలపరుస్తుంది, ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహిస్తుంది. యాంటీఆక్సిడెంట్ శరీరంలో విషాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది.
వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చితే ప్రోటీన్ కొరత లేకుండా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఉదయం సమయంలో తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి ఏమీ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. అలాగే బరువు నియంత్రణలో కూడా సహాయ పడుతుంది. కాబట్టి పిల్లలకు వాల్ నట్స్ పెట్టి ఈ ప్రయోజనాలు అందేలా చూడాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.