బాషా సినిమా మెగాస్టార్ వదిలేయటానికి అసలు కారణం ఇదే

Basha Telugu Movie :కొన్ని సినిమాలు చేద్దామని అనుకున్నా ఎందుకో కుదరదు. ఒక్కోసారి అవి వేరేవాళ్ళ చేతికి కూడా వెళ్లిపోతాయి. కొన్ని చేసినా హిట్ రాదు. ఇలా సినిమా రంగంలో చాలా విచిత్ర ఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన బాషా సినిమా బంపర్ హిట్ అయింది. ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అదే రేంజ్ లో కలెక్షన్స్ తెచ్చింది.

సురేష్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన బాషా మూవీ విడుదల కాకముందే ఈ మూవీ రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటించాలని అనుకున్నారట. సినిమా రిలీజ్ కి ముందే చెన్నై కి షూటింగ్ కోసం వచ్చిన మెగాస్టార్ ని సురేష్ కృష్ణ కలిశారు కూడా. బాషా విషయం చెప్పగా తెలుగులో రీమేక్ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని చిరు భావించడం, హక్కులు కొనడానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సిద్ధం కావడం అయింది.

తమిళ ప్రొడ్యూసర్ ని సంప్రదించి తెలుగు రైట్స్ అడిగేసరికి ఏకమా 40లక్షలు చెప్పారట. వాస్తవానికి ఇప్పుడు ఈ ఎమౌంట్ తక్కువే అయినా 25ఏళ్ల క్రితం చాలా ఎక్కువ. అందుకే అప్పట్లో 25లక్షలకు అడిగారట. ప్రొడ్యూసర్ ససేమిరా అనడంతో అరవింద్ ఆ ప్రాజెక్ట్ వదిలేసారు. అయితే తెలుగులో డబ్బింగ్ చేసి, సదరు నిర్మాత విడుదల చేయగా, బ్లాక్ బస్టర్ కొట్టింది. సో ..కారణం ఏదైనా ఈ సినిమా మెగాస్టార్ మిస్ అయ్యాడు.