మెంతులతో ఇలా చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి 3 రెట్లు వేగంగా జుట్టు పెరుగుతుంది

fenugreek seeds hair fall Tips : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధ పడుతున్నారు. జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారూ పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.
fenugreek seeds
అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని పదార్ధాలతో ఈ సమస్యల నుండి బయట పడవచ్చు. ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. రాత్రి సమయంలో ఒక బౌల్ లో రెండు స్పూన్ల మెంతులను వేసి నీటిని పోసి నానబెట్టాలి.

మరుసటి రోజు ఉదయం నీటితో సహ మెంతులను మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత మూడు జామ ఆకులను శుభ్రంగా కడిగి వేసి మెత్తగా మిక్సీ చేయాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో ఒక విటమిన్ E క్యాప్సిల్ లోని ఆయిల్ వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి.
hair fall tips in telugu
గంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటమే కాకుండా చుండ్రు సమస్య కూడా ఉండదు. జామ ఆకుల్లో విటమిన్ బి,సి ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు అవసరమైన కొల్లాజెన్ పెంచటంలో సహాయపడతాయి.

జామ ఆకుల్లో అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్‌ను చాలా త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ఒకటి. మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. మెంతులలో ఉండే పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.