కాకరకాయతో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరిసిపోతుంది

Bitter Gourd Benefits in telugu : మనలో చాలా మంది ముఖం మీద నల్లని మచ్చలు,మురికి,దుమ్ము,ధూళి లేకుండా అందంగా మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాల ద్వారా ముఖం మెరిసేలా చేసుకోవచ్చు.

కాకరకాయ చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. కాకరకాయలో విటమిన్-A, C, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. కాకరకాయను ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.
Young Look In Telugu
ఒక బౌల్ లో ఒక స్పూన్ కాకరకాయ పేస్ట్, అరస్పూన్ శనగపిండి,అరస్పూన్ తేనె వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే చర్మం మీద పెరుకుపోయిన మృత కణాలను లోతుగా శుభ్రం చేసి ముఖం మెరిసేలా చేస్తుంది.

మొటిమలు, నల్లని మచ్చలు, దురద, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వంటి అన్నీ రకాల సమస్యలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. కాకరకాయలో కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటాం. అయితే బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.
Pimples,Beauty
కాకరకాయ జ్యూస్ తాగిన చర్మ ప్రయోజనాలు కలగటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా చర్మ సమస్యల నుండి బయట పడవచ్చు. కాబట్టి ఈ ప్యాక్ ట్రై చేసి మొటిమలు,పిగ్మెంటేషన్ వంటి అన్నీ రకాల సమస్యలు తొలగి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.