Healthhealth tips in telugu

యూరిక్ యాసిడ్ ఉన్నవారు కాకరకాయ తీసుకుంటే…ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు…

High Uric Acid Level bitter gourd : ఈ మధ్య కాలంలో యూరిక్ యాసిడ్ సమస్య చాలా ఎక్కువ అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా మనలో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. .
uric acid
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవటానికి ఎన్నో రకాల మందులు ఉన్నాయి. అలా మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలను కూడా ఫాలో అయితే చాలా తొందరగా యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. మనం తీసుకునే ఆహారంలో ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.

ఇది ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఒకవేళ విసర్జన సరిగ్గా జరగకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది. అవి క్రమంగా స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. ఈ సమస్య వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది.
యూరిక్ యాసిడ్ ని తగ్గించటానికి కాకరకాయ సహాయపడుతుంది.

కాకరకాయ చేదుగా ఉంటుందని మనలో చాలామంది తినటానికి ఇష్టపడరు. అయితే కాకరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతే. కాకుండా కాకరకాయలో ఉన్న పోషకాలు యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.
Uric acid
కాకరకాయను జ్యూస్ గా తయారు చేసుకుని తీసుకోవచ్చు. కాకరకాయను తీసుకోవడం వల్ల యూరిక్ స్థాయిలు తగ్గడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా చెరు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. బరువు తగ్గుతారు. కాలేయ పనితీరు మెరుగుబడి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.