ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా 5 నిమిషాల్లో తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి

Home remedies for white teeth and bad breath : పళ్ళు తెల్లగా అందంగా మెరుస్తూ ఉంటేనే బాగుంటుంది. చాలా.మంది పళ్ళు గార పట్టి పసుపు రంగులో మారి ఉంటాయి. అంతేకాకుండా మరి కొంత మందికి చిగుళ్ల వాపు వస్తుంది. అలాగే నోటి దుర్వాసన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది.
White teeth tips
ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్ధంగా ఉండే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ రెమిడీ కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.
cococnut Oil benefits in telugu
ఒక బౌల్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె,అరస్పూన్ బేకింగ్ సోడా,చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్‌ని ఉపయోగించి పళ్లపై ఒక నిమిషం పాటు బ్రష్ చేయాలి. 2 నిమిషాల పాటు అలా వదిలేసి…ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు సార్లు చేస్తే పళ్ళు తెల్లగా మెరుస్తాయి.

కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ దంతాలపై బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడతాయి. చిగుళ్ళలో సున్నితత్వం మరియు వాపును తగ్గించడంలో పసుపు సహాయపడుతుంది. బేకింగ్ సోడా ఫలకాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఈ రెమిడీ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
pasupu benefits
కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గార పట్టిన పసుపు పళ్ళను తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ రెమిడీకి ఉపయోగించిన మూడు ఇంగ్రిడియన్స్ మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కాను చేయటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.