బెండకాయతో ఇలా చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి 3 రెట్లు వేగంగా జుట్టు పెరుగుతుంది

Ladies finger Hair Fall Tips In Telugu : బెండకాయలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే బెండకాయ జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుందని మనలో చాలామందికి తెలియదు. .జుట్టు రాలే సమస్య,పొడి జుట్టు సమస్య,చుండ్రు సమస్యను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
Bendakaya Benefits In telugu
ఆరు బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి అర గ్లాసు నీటిని పోసి నీరు వేడెక్కాక బెండకాయ ముక్కలు వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికిన బెండకాయ ముక్కలు కాస్త చల్లారాక నీటితో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. .
badam oil Skin Benefits
ఈ మిశ్రమంలో ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి ఒక గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య, పొడి జుట్టు సమస్య ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి జుట్టు మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది.
hair fall tips in telugu
బెండకాయలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా చేయటమే కాకుండా జుట్టు మృదువుగా ఉండటానికి సహాయ పడుతుంది. బెండకాయలో జుట్టుకి పోషణను అందించే ప్రోటీన్స్ సమృద్దిగా ఉన్నాయి. తల మీద చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేసి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.
Hair Care
బాదం నూనెలో విటమిన్ ఇ, ప్రొటీన్లు, పొటాషియం, జింక్ మరియు ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్దిగా ఉంటాయి. జుట్టును ఆరోగ్యంగా మరియు మెరిసేలా చేస్తుంది. అలాగే బాదం నూనె హైడ్రేటింగ్ మరియు పోషణ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ప్యాక్ తలకు పట్టించి జుట్టు సమస్యలను తగ్గించుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.