ఈ పండుతో ఇలా చేస్తే మొటిమలు, నల్లని మచ్చలు, సన్ టాన్ తొలగిపోయి ముఖం తెల్లగా మెరిసిపోతుంది

Pimples Home remedies In telugu : ప్రతి ఒక్కరూ అందమైన ముఖం ఉండాలని కోరుకుంటారు. మనలో చాలా మందికి ముఖం మీద మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు.
dragon fruit telugu
చాలా తక్కువ ఖర్చులో మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి ముఖం తెల్లగా కాంతివంతంగా మారేలా చేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తాగే ఉన్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే డ్రాగన్ ఫ్రూట్ లో బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
Dragon fruit Benefits in telugu
ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. డ్రాగన్ ఫ్రూట్ ముక్కలను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ డ్రాగన్ ఫ్రూట్ పేస్ట్, అర స్పూన్ కార్న్ ఫ్లోర్ లేదా బియ్యప్పిండి లేదా సెనగపిండి, ఒక స్పూను పచ్చి పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
Pimples,Beauty
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మొటిమలు, నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి చర్మానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్ లో ఎటువంటి కెమికల్స్ లేవు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు.
Wrinkles remove Tips In Telugu
డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో చాలా విరివిగానే లభ్యం అవుతుంది. ఈ ప్యాక్ వేసుకోవటం వలన ముడతలు తగ్గటమే కాకుండా వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్యాక్ ట్రై చేసి మంచి ఫలితాన్ని పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.