బీపీ, గుండె సమస్యలు ఉన్నవారు బంగాళదుంప తింటే ఏమి అవుతుందో తెలుసా?
Benefits Of Potatoes in telugu : మనలో చాలా మందికి Potato అంటే చాలా ఇష్టం. బంగాళాదుంపతో ఏమి చేసినా ఇష్టంగా తింటారు. బంగాళదుంపలలో ఫైబర్ మరియు పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటును తగ్గించటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
బంగాళాదుంప ఉడికించిన విధానం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు బంగాళాదుంపను చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే, అంటే కుక్కర్ లో ఉడికించినట్లయితే, దానిలోని అన్ని పోషకాలు పోతాయి.కానీ మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా బంగాళదుంపలను ఉడికిస్తే, బంగాళాదుంపలో లభించే అన్ని పోషకాలు అలాగే ఉంటాయి.
అంతే కాకుండా యాంటీఆక్సిడెంట్ మూలకాలు కూడా అలాగే ఉంటాయి. కొంతమంది బంగాళాదుంపను తింటే చేతులు మరియు కాళ్ళు తిమ్మిరి, గ్యాస్ట్రిక్ మరియు జలుబు సమస్యలు వస్తాయని బంగాళాదుంపకు దూరంగా ఉంటారు. అయితే బంగాళాదుంపను మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
బంగాళాదుంపలో ఫైబర్ మరియు పొటాషియం సమృద్దిగా ఉండుట వలన జీర్ణక్రియను పెంచటమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. Potato లో ఉండే ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ B6 అనేవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.
ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. రక్తపోటు సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. రక్తపోటుకు మందులను వాడుతూ కొన్ని జాగ్రత్తలను పాటించాలి. అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే పొటాషియం సమృద్దిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
బంగాళదుంపలతో పాటు, అరటిపండ్లు, బ్రోకలీ మరియు బచ్చలికూర వంటి ఆహారాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. బంగాళాదుంపలలో మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన దీర్ఘ కాలంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/