Healthhealth tips in telugu

అంగుళం ముక్క…100 ఏళ్ళు వచ్చిన గుండె జబ్బులు,డయాబెటిస్,కీళ్లనొప్పులు,కొలస్ట్రాల్ అనేవి అసలు ఉండవు

Arjuna herb uses In Telugu : అర్జున్ చెట్టు అని పిలిచే తెల్ల మద్ది చెట్టు భారతదేశంలో చాలా విస్తృతంగా పెరుగుతుంది. దీని బెరడు లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కానీ మనలో చాలామందికి ఆ విషయం తెలీదు. తెల్ల మద్ది చెట్టు బెరడును ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు. మూడు అర్జున్ చెట్టు బెరడు ముక్కలు,అంగుళం దాల్చిన చెక్క ముక్కను ఒక గ్లాస్ నీటిలో వేసి 5 నిమిషాలు మరిగించాలి.
arjuna-herb-uses-benefits
ఈ నీటిని వడకట్టి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగితే గుండె సమస్యలకు కారణం అయినా రక్తపోటు,కొలస్ట్రాల్ లను తగ్గిస్తుంది. అర్జున బెరడులో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ-క్లాటింగ్ ఏజెంట్ గా పనిచేయటం వలన స్ట్రోక్, గుండెపోటు వంటి సమస్యలు ఉండవు. కాల్షియం, మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

మధుమేహం ఉన్న వారిలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. గ్లూకోజ్ ఉత్పత్తిలో పాల్గొనే కొన్ని ఎంజైమ్స్ .ని నిరోధిస్తుంది దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. అధిక బరువు సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి పనితీరు బాగుండేలా చేసే గ్యాస్., ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. ఈ చలికాలంలో దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అర్జున బెరడులో యాంటీటిస్సివ్ ప్రభావాలు ఉండుట వలన దగ్గు, గొంతు నొప్పి తగ్గిస్తుంది. ఈ నీటిని వారంలో మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ నీరు చాలా బాగా సహాయపడుతుంది.

అర్జున బెరడు నరాల బలహీనత, నీరసం,అలసట వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. ఈ అర్జున బెరడు వాడటానికి ముందు ఒకసారి ఆయుర్వేద వైధ్య నిపుణుని సలహా తీసుకోవటం చాలా మంచిది. 15 రోజుల పాటు ఈ కాషాయన్ని తాగి వారం రోజులు గ్యాప్ ఇచ్చి మరల 15 రోజుల పాటు తాగాలి. ఇలా చేస్తూ ఉంటే సమస్యల నుండి బయట పడవచ్చు. అలాగే సమస్యలు రాకుండా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.