ఈ పొడిని భోజనంలో మొదటి ముద్దగా తింటే శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు

Belly Fat Powder In telugu : మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువసేపు అలా కూర్చుని ఉండిపోవడం, కొన్ని రకాల మందులు వాడటం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

ఈ సమస్య నుంచి బయటపడటానికి మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. వేల కొద్ది డబ్బు ఖర్చు అవుతుంది .అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా ఒక పొడిని తయారు చేసుకుని వాడితే 15 రోజుల్లోనే బరువు తగ్గడాన్ని గమనించి మీరు ఆశ్చర్యపోతారు.
cumin seeds
పొయ్యి మీద పాన్ పెట్టి మూడు స్పూన్ల అవిసె గింజలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో రెండు స్పూన్ల జీలకర్ర, ఒక స్పూన్ సోంపు గింజలు వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు కరివేపాకు వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. .
sompu beenfits
ఇప్పుడు మిక్సీ జార్ లో వేగించి పెట్టుకున్న అవిసె గింజలు, జీలకర్ర, సోంపు గింజలు, కరివేపాకు, అర స్పూన్ పసుపు, 1/4 స్పూన్ నల్ల ఉప్పు, పావు స్పూను కరక్కాయ పొడి, పావు స్పూను ఇంగువ వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడి గాజు సీసాలో నిల్వ చేసుకుంటే దాదాపుగా 15 రోజులు పాటు నిల్వ ఉంటుంది.
Hair Fall Tips in telugu
ఈ పొడిని ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో మొదటి ముద్దలో కలుపుకుని తింటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అలాగే శరీరంలో .రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అధిక బరువు సమస్య నుంచి బయటపడే ప్రణాళికలో ఉన్నవారికి ఈ పొడి చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.