Healthhealth tips in telugu

Chickpeas and Dates:శనగలు,ఖర్జూరం కలిపి తీసుకుంటే…ముఖ్యంగా బరువు తక్కువ ఉన్నవారు…

Chickpeas And Dates Benefits In telugu : శనగలు, ఖర్జూరం రెండింటిలోను ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరం ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.

శనగలు,ఖర్జూరం కలిపి తీసుకోవటం వలన చర్మానికి అవసరమైన పోషకాలు అంది చర్మం ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంటుంది. అలాగే వృద్ధాప్య ఛాయలు ఆలస్యం అవుతాయి. శారీరక బలహీనత,అలసట,నీరసం వంటి వాటిని తగ్గించి చురుకుగా ఉండేలా చేస్తుంది. వీటిలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గించటమే కాకుండా నీరసం,అలసట లేకుండా చేస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఈ రెండింటిలో ప్రోటీన్ తో సహ ఎన్నో పోషకాలు ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ గా వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి.

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే వ్యాధులను తట్టుకొనే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీటిలో కాల్షియం, ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్లు సమృద్దిగా ఉండుట వలన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. తక్కువ బరువు ఉన్నవారు తింటే వాటిలో ఉండే పోషకాలు ముఖ్యంగా కార్బోహైడ్రేట్ బరువు పెరగటానికి సహాయపడతాయి.

శనగలు,ఖర్జూరం రెండింటినీ రోజులో ఎప్పుడైనా తినవచ్చు. ఇలా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తింటే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాము. శనగలు,ఖర్జూరం మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. రక్తహీనత,తక్కువ బరువు ఉన్నవారికి చాలా బాగా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.