అల్లం టీ ఎక్కువగా తాగుతున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు….

Ginger Tea Side Effects In Telugu : మనలో చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం టీ తాగకపోతే రోజంతా హుషారు ఉండదు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యానికి మంచిదని అల్లం టీ ని ఎక్కువగా తాగుతున్నారు. అయితే అల్లం టీ ఎక్కువగా తాగితే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి..
Ginger benefits in telugu
అల్లం టీని తగిన మోతాదులో తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆలాగే అధిక బరువు ఉన్నవారిలో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.
Ginger Tea Side Effects
ఆలాగే డయాబెటిస్ ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే అల్లం టీని ఎక్కువగా తాగితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అల్లం టీ ఎక్కువగా తాగితే గుండెల్లో మంట,విరేచనాలు, గ్యాస్ మరియు కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అల్లం టీలో యాంటీ ప్లేట్లెట్స్ ఉంటాయి.
gas troble home remedies
ఇవి రక్త స్రావాన్ని కలిగిస్తాయి. బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారు కూడా అల్లం టీ తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అల్లం టీ ఎక్కువగా తాగటం వలన డయేరియా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అల్లం టీ తక్కువ పరిమాణంలో తీసుకుంటే జీర్ణశక్తిని పెంచుతుంది. అదే ఎక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు ఆటంకాన్ని కలిగిస్తుంది. .
blood thinning
కొన్ని మందులు వాడేవారు అల్లం టీని ఎక్కువగా తీసుకోకూడదు. తక్కువ మోతాదులో తీసుకుంటే అల్లం టీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఏదైనా మోతాదు మించితే అనర్ధమే కదా…కాబట్టి లిమిట్ గా తీసుకొని వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.