ఈ ఇడ్లీ తింటే చాలు విపరీతమైన ప్రోటీన్ లభిస్తుంది…ప్రోటీన్ లోపం అనేది ఉండదు

Healthy sprouts idli at home : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మనలో చాలా మంది మొలకెత్తిన గింజలు తినాలంటే పెద్దగా ఆసక్తి చూపరు. ఎందుకంటే అవి రుచిగా ఉండవని ఇష్టపడరు. అయితే కొంతమంది గ్యాస్ సమస్య వస్తుందని తినరు.
sprouts benefits
అలాంటివారు మొలకెత్తిన గింజలతో ఇడ్లీ తయారు చేసుకుని తింటే రుచిగా ఉండటమే కాకుండా మన శరీరానికి అవసరమైన పోషకాలు అన్నీ లభిస్తాయి. ఇప్పుడు మొలకెత్తిన గింజలతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కాస్త ఓపికగా చేసుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
Chickpeas sprouts benefits
మిక్సీ జార్ లో అర కప్పు మొలకెత్తిన శనగలు, అరకప్పు మొలకెత్తిన పెసలు, ఒక కప్పు పెరుగు, అరకప్పు ఓట్స్, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, రెండు పచ్చిమిర్చి వేసి మెత్తని ఇడ్లీ పిండిగా మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుని ఒక గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఇడ్లీ రేకులపై మీగడ రాసి ఇడ్లీలుగా వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి.
weight loss tips in telugu
ఈ ఇడ్లీలను అన్ని వయసుల వారు తినవచ్చు. వారంలో రెండుసార్లు తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ప్రోటీన్ లోపంతో బాధపడే వారికి ఈ ఇడ్లీలు చాలా బాగా సహాయపడతాయి. అలాగే .ఫైబర్ మరియు ఎన్నో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఈ ఇడ్లీలు మొలకెత్తిన గింజలు తినలేని వారికి మాత్రమే.
oats benefits
మొలకెత్తిన గింజలు తింటేనే వాటిలో ఉన్న పోషకాలు అన్ని మన శరీరానికి అందుతాయి. ఇలా ఇడ్లీలా తయారు చేసుకుంటే కొన్ని పోషకాలు తగ్గుతాయి. కాబట్టి మొలకలను తినలేని వారు ఇలా ఇడ్లీ చేసుకొని తింటే మంచి ప్రయోజనాలను పొందుతారు. పెసలు,శనగలు రెండింటిలోను ప్రోటీన్,ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. బరువు తగ్గాలని అనుకొనేవారికి కూడా మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.