టీ, కాఫీల‌కు బ‌దులుగా ఈ డ్రింక్ తాగితే మైండ్ రీఫ్రెష్‌గా, యాక్టివ్‌గా మారి జ్ఞాపక శక్తి సమస్యలు ఉండవు

Pudina lemon drink In telugu : మనలో చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. అలా తాగకపోతే రోజంతా హుషారు లేకుండా నిసత్తుగా ఉంటుంది. అలా టీ లేదా కాఫీ అనేది మన జీవితాలలో ఒక బాగం అయ్యిపోయింది. ఉదయం సమయంలో కాఫీ, టీలకు బదులు ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.

మైండ్ ను రిఫ్రెష్ గా యాక్టివ్ గా చేసి జ్ఞాపక శక్తి సమస్యలు లేకుండా చేయటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ డ్రింక్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ఒక స్పూను సబ్జా గింజలను నీటిలో వేసి రెండు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత 15 పుదీనా ఆకులను నీటిలో శుభ్రంగా కడిగి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి.
Health Benefits Of Eating Pudina
ఆ తర్వాత ఒక బాటిల్ లో నానపెట్టిన సబ్జా గింజలు, దంచిపెట్టిన పుదీనా ఆకులు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్ తేనె, అర స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, చిటికెడు నల్ల ఉప్పు, ఒక గ్లాసు చల్లని నీరు వేసి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు బాగా షేక్ చేసి పది నిమిషాలు అలా వదిలేయాలి. .

ఆ తర్వాత ఆ నీటిని గ్లాసులో సర్వ్ చేసి తాగటమే. ఈ డ్రింక్ ని ఉదయం సమయంలో తాగితే మైండ్ ఫ్రెష్ గా యాక్టివ్ గా మారటమే కాకుండా తలనొప్పి, చిరాకు, ఒత్తిడి వంటి అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. అలాగే అధిక బరువు ఉన్నవారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు, మలినాలను తొలగించడమే కాకుండా అదనంగా పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది. .
Honey benefits in telugu
జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. దాంతో ఆటోమేటిక్ గా బరువు తగ్గుతారు. ఉదయం సమయంలో ఆరోగ్యకరమైన డ్రింకులను తాగితే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇటువంటి డ్రింక్స్ తాగటం ఎంతైనా మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.