అర గ్లాసు చాలు శరీరంలో గ్యాస్,అజీర్ణం,అసిడిటీ,మలబద్దకం సమస్యలను మాయం చేస్తుంది

Constipation Home Remedies in telugu : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోకపోవడం, కొన్ని రకాల మందులను వాడటం, రోజుల్లో తగినంత నీటిని తాగక పోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో ఈ మలబద్ధకం సమస్య అనేది చాలా తీవ్రంగా వేధిస్తోంది.
gas troble home remedies
అలాగే మనలో చాలా మంది గ్యాస్,ఎసిడిటీ,అజీర్ణం వంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.గ్యాస్ సమస్య వచ్చింది అంటే ఒక పట్టాన తగ్గదు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడుతాయి. ప్రతి రోజు ఇప్పుడు చెప్పే డ్రింక్ అరగ్లాసు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అరస్పూన్ జీలకర్ర, రెండు యాలకులను దంచి వేయాలి. ఆ తర్వాత అరస్పూన్ ధనియాలను వేసి 7 నుంచి 9 నిమిషాల వరకు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి. రుచి కోసం అరస్పూన్ తేనె కలపవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి.
jeelakarra Health Benefits in telugu
జీలకర్రలో ఉన్న పోషకాలు జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి. జీలకర్రలోని థైమోల్ అనే సమ్మేళనం ఎంజైమ్‌లను ప్రేరేపించి జీర్ణ రసాలను బాగా స్రవించటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. జీలకర్రలో ఉండే ఆల్డిహైడ్, థైమోల్ మరియు ఫాస్పరస్ అనేవి మంచి డిటాక్సిఫైయింగ్ ఏజెంట్లుగా పని చేసి శరీరంలోని విషాలను బయటకు పంపుతాయి.
dhaniyalu
ధనియాలలో ఉండే పోషకాలు గుండెల్లో మంట మరియు ఆమ్లత్వానికి వ్యతిరేకంగా శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది కడుపు నొప్పికి వ్యతిరేకంగా కూడా బాగా పనిచేస్తుంది. అలాగే జీవక్రియను నియంత్రిస్తుంది. కడుపు ఉబ్బరం మరియు అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. ధనియాలలో ఉన్న పోషకాలు జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేసే జీర్ణ సమ్మేళనాలు మరియు రసాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.

యాలకులలో యాంటీ ఆక్సిడెంట్స్ సమ్మేళనాలు ఉండుట వలన కడుపులో గ్యాస్,అజీర్ణం వంటి సమస్యలను తగ్గించటమే కాకుండా ప్రేగు పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. కాబట్టి గ్యాస్,అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలకు ఇలా ఇప్పుడు చెప్పిన చిట్కా ఫాలో అయితే మంచి ప్రయోజనం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.