Healthhealth tips in telugu

అవిసె గింజలను ఎక్కువగా తింటున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…

Flax seeds Side Effects In Telugu : ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి అవిసె గింజల వాడకం బాగా పెరిగింది. అవిసె గింజలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవిసె గింజలను రోజుకి అరస్పూన్ మోతాదులో తీసుకుంటే వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు.

కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు రెగ్యులర్ గా తీసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలగటమే కాకుండా కీళ్ల మధ్య జిగురు కూడా పెరుగుతుంది. వీటిని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. వీటిలో మంచి కొవ్వులు, విటమిన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి.

మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలెర్జీ సమస్యలు ఉన్నవారు ఈ గింజలకు దూరంగా ఉండాలి. దురద, వాపు, ఎరుపు లేదా దద్దుర్లు కనిపిస్తే వెంటనే వీటిని తినటం మానేయాలి. శరీరంలో మంటను పెంచే అవకాశం ఉంది. అవిసె గింజలు ఈస్ట్రోజెన్ లాగా పనిచేస్తాయి. అందువల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది.
gas troble home remedies
అందువల్ల హార్మోన్ల సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకుండా ఉంటేనే మంచిది. అవిసె గింజల్లో డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన ప్రేగు కదలికలు బాగా పెరిగిపోయి కడుపు నొప్పి, అతిసారం, మలబద్ధకం మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మలబద్దకం సమస్య ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
blood
అవిసె గింజలు రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. కాబట్టి శస్త్రచికిత్స చేయించుకొనే ముందు ఈ గింజలకు దూరంగా ఉంటే మంచిది. అవిసె గింజలను పచ్చిగా తినకూడదు. పొడిగా లేదా వేగించి తీసుకోవాలి…లేదంటే నానబెట్టి తీసుకోవచ్చు. వీటిని పొడిగా కాకుండా గింజల రూపంలో తీసుకుంటే బాగా నమిలి తినాలి. .ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.