Beauty Tips

ఇలా చేస్తే పగిలిన,నల్లగా ఉన్న పెదాలు మృదువుగా గులాబీ రంగులోకి మారతాయి

Black lips to pink lips : పెదాలు నల్లగా లేకుండా గులాబీ రంగులో మెరిసిపోతూ ఉంటే చూడటానికి చాలా బాగుంటాయి. అయితే ఆహారపు అలవాట్లు., ధూమపానం, మద్యపానం, వాతావరణంలో వచ్చే మార్పులు, మృత కణాలు, శరీరంలో అధిక వేడి ప్రభావం, కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్ స్టిక్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి.
carrot beetroot juice
అలాగే చాలా మందికి పెదాలు పగులుతూ ఉంటాయి. ఇప్పుడు కాలం మారటంతో పెదాలు పగిలే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెదాలపై ఎక్కువ శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉంది. చాలామంది పెదాలను గులాబీ రంగులో మార్చుకోవటానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా చాలా తక్కువ ఖర్చులో ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు. బీట్ రూట్ తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసి…దాని నుంచి జ్యూస్ తీయాలి. ఒక బౌల్ లో మూడు స్పూన్ల బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి.
Beauty
ఆ తర్వాత ఒక స్పూన్ షియా బటర్, ఒక స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, అర స్పూన్ గ్లిజరిన్, అరస్పూన్ బాదం నూనె వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత కాస్త చల్లారాక ఒక బాక్స్ లో పెట్టి రెండు గంటల పాటు అలా వదిలేస్తే లిప్ బామ్ తయారవుతుంది.
badam oil Skin Benefits
ఈ లిప్ బామ్ ని రోజులో మూడు లేదా నాలుగు సార్లు పెదాలకు రాస్తూ ఉంటే కేవలం వారం రోజుల్లోనే నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి. అలాగే పగిలిన పెదాలు మృదువుగా మారతాయి. సహజసిద్దమైన ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కాస్త ఓపికగా ఇలాంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.