Beauty Tips

Dandruff:ఈ సీజన్ లో ఇలా చేస్తే వేలకు వేలు ఖర్చు పెట్టిన తగ్గని చుండ్రు శాశ్వతంగా తొలగిపోతుంది…

Dandruff Home Remedies In Winter : సాధారణంగా మనలో చాలా మంది ఎక్కువగా ఇబ్బంది పడే సమస్యల్లో చుండ్రు సమస్య ఒకటి. చుండ్రు సమస్య ఒకసారి వచ్చిందంటే తగ్గించుకోవడం చాలా కష్టం. చాలా మంది చుండ్రు సమస్య రాగానే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వైపు వెళుతూ ఉంటారు.

అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చుండ్రు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. చుండ్రు సమస్య ఉందంటే జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది. కాబట్టి చుండ్రు సమస్య ప్రారంభం కాగానే చాలా త్వరగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. .

మిగతా సీజన్లతో పోలిస్తే ఈ చలికాలంలో చుండ్రు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే దురద., చిరాకు, జుట్టు రాలే సమస్య వంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా సులభంగా బయటపడవచ్చు. రాత్రి సమయంలో ఒక బౌల్ లో రెండు స్పూన్ల మెంతులు వేసి నీటిని పోసి నానబెట్టాలి.

మరుసటి రోజు ఉదయం ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో నానబెట్టిన మెంతులను నీటితో సహా పోయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. .ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని దానిలో ఒక స్పూన్ భృంగరాజ్ పొడి,రెండు స్పూన్ల ఆముదం వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఒక గంట అయ్యాక కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య చాలా వేగంగా తగ్గిపోతుంది. అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కాబట్టి చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ఈ రెమెడీని ఫాలో అయ్యి జుట్టు రాలే సమస్యను చుండ్రు సమస్యను తగ్గించుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.