ప్రేమదేశం అబ్బాస్ సినిమా రంగాన్ని వదిలి ఏ రంగంలో స్థిరపడ్డాడో తెలుసా?

సరిగ్గా 22ఏళ్ళ క్రితం తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మరీ ముఖ్యంగా యువతీ యువకులను ప్రేమలోకంలో విహరింపజేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ తో వచ్చిన మూవీ ప్రేమదేశం. ఈ మూవీ నేటికీ ఎవర్ గ్రీన్ మూవీగా చెప్పొచ్చు .అబ్బాస్, వినీత్, టబు ముఖ్య పాత్రలు పోషించిన ప్రేమదేశం సినిమాకు కదీర్ దర్శకత్వం వహించగా, ఏ ఆర్ రెహ్మన్ సంగీతం తో మైమరపించారు. ఈ మూవీలోని పాటలు ప్లాటినం డిస్క్ అందుకున్నాయి. ఇక ఈ సినిమాతోనే అబ్బాస్ తెరంగేట్రం చేసాడు.

అప్పటివరకూ మోడలింగ్ రంగం తప్ప మరొక ఫీల్డ్ తెలియని అబ్బాస్,ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమాతో ఎక్కడ చూసినా కుర్రాళ్ళు అబ్బాస్ హెయిర్ స్టైల్ ఫాలో అయ్యారు. ఇక ఏ హీరోకైనా తొలిచిత్రం కనీవినీ ఎరుగని రేంజ్ కి వెళ్తే, ఇక ఆ హీరో కెరీర్ చాలా ఎత్తుకు ఎదుగుతుంది. మరి ఎందుకనో అబ్బాస్ కెరీర్ మధ్త్యస్తంగానే మిగిలిపోయింది.

ఇక అబ్బాస్ పర్సనల్ విషయం చూస్తే, కోల్ కత్తాలో 1975లో మే21న జన్మించాడు. అతని పూర్తిపేరు మీర్జా అబ్బాస్ అలీ. బాలీవుడ్ యాక్టర్ ఫిరోజ్ ఖాన్ కి దగ్గర బంధువే అబ్బాస్ తల్లి. చిన్నప్పటినుంచి హిందీ , బెంగాలీ మూవీస్ ఎక్కువగా చూసే అబ్బాస్,స్టడీస్ రోజుల్లో మోడలింగ్ చేసేవాడు. సరిగ్గా అదేసమయంలో కదీర్ దర్శకత్వంలో తమిళంలో తీస్తున్న కాదల్ దేశం మూవీలో ఛాన్స్ తగిలింది.

నిజానికి తనకు తమిళం రాకపోవడంతో ఆడిషన్స్ కి తన ఫ్రెండ్స్ ని పంపించాడు. కానీ ఫ్రెండ్స్ తమ వెంట బలవంతంగా అబ్బాస్ ని తీసుకెళ్లారు. ఇక అక్కడ అబ్బాస్ ఫెరఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన కదీర్ అబ్బాస్ ని ఎంపిక చేసాడు. అదే మూవీ తెలుగులో ప్రేమదేశంగా విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈమూవీ తర్వాత అబ్బాస్ కి విచిత్ర పరిస్థితి ఎదురైంది. తమిళ, తెలుగు భాషల్లో బోల్డన్నీ ఆఫర్స్ వచ్చిపడ్డాయి. దాంతో ఏది వదిలేయాలా, ఏది చేయాలో తెలియక ఎన్నో సినిమాలకు ఒకే చెప్పేసాడు.

ఇక కొన్ని వదిలేసాడు. అలా వదిలేసిన చిత్రాల్లో బ్లాక్ బస్టర్ గా నిల్చిన కాథలిక్ మలై,జీన్స్ మూవీలున్నాయి. కానీ అబ్బాస్ నటించిన జాలీ, ఇన్నేలా సుగమి,వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో తెలుగులోకి జంప్ అయిన ఈ బెంగాలీ బాబుకి ప్రియా ఓ ప్రియా , రాజహంస వంటి సినిమాలు ఊరట నిచ్చాయి.

ఇక ఆ తర్వాత సినిమాలు దెబ్బతినడం వలన అడపాదడపా క్యారక్టర్ రోల్స్ కి పరిమితం అయ్యాడు. ఇక ఇప్పుడు అదీలేదు. అయితే కెరీర్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడే 2001లో ఏరోమా అనే ఫ్యాషన్ డిజైనర్ ని పెళ్లిచేసుకున్న అబ్బాస్ కి అమరా , అయేమా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెన్నైలో సెటిల్ అయిన అబ్బాస్ భార్య తమిళంలో అనేక మూవీస్ కి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవరించింది.

అలాగే ఇంకో నటుడు మాధవన్ వైఫ్ తో కల్సి ఏరోమా కొన్ని చిత్రాలకు స్టైలిష్ గా వర్క్ చేసింది. ఇక మలయాళ చిత్రంలో ఆఖరిగా నటించి ఛాన్సులు లేని,అబ్బాస్ భార్యతో కల్సి ఫ్యాషన్ డిజైన్ రంగంలో అడుగుపెట్టినట్లు చెబుతున్నారు.