Healthhealth tips in telugu

Weight Loss Tips:1 గ్లాసు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి బాన పొట్ట ప్లాట్ గా మారుతుంది

Fat Cutter Drink and Weight loss In Telugu : ఈ రోజుల్లో మారిన జీవనశైలి, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, ఎక్కువసేపు అలా కూర్చుని ఉండటం, వ్యాయామం చేయకపోవడం వంటి ఎన్నో రకాల కారణాలతో చాలా చిన్న వయసులోనే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అలాగే పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయి చాలా లావుగా కనబడుతున్నారు. .
lemon benefits
దాంతో మనలో చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే పదార్థాలతో చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. .

ప్రతిరోజు అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే నెల రోజుల్లో మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈ సీజన్ లో నిమ్మకాయలు చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. ఒక నిమ్మకాయ తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత ఒక కీరా దోసకాయను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
Ginger Tips In Telugu
ఆ తర్వాత ఒక బ్లెండర్ తీసుకుని దానిలో కట్ చేసిన నిమ్మకాయ ముక్కలు., కీరా మొక్కలు, గుప్పెడు పార్స్లీ ఆకులు, ఒక స్పూన్ అల్లం ముక్కలు, ఒక గ్లాసు నీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పల్చని వస్త్రం సాయంతో జ్యూస్ ను సపరేట్ చేయాలి. ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ముందు తాగాలి.
parsley
వీటిలో ఉన్న పాషకాలు పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును చాలా వేగంగా కరిగించి నాజుగ్గా ఉండేలా చేస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు తగ్గటమే కాకుండా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు బయటకు పోతాయి. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
Weight Loss tips in telugu
ఈ సీజన్లో వచ్చే అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజు అరగంట వ్యాయామం చేస్తూ ఈ డ్రింకు తాగితే తప్పకుండా శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఈ డ్రింక్ తయారుచేసుకొని తాగితే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.