ఈ జ్యూస్ జుట్టు కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది
Hair Growth Juice In Telugu : ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి సమస్యలు చాలా ఎక్కువగా ఇబ్బందిని కలిగిస్తున్నాయి. జుట్టు ఆరోగ్యకరంగా ఉండాలంటే మన జీవనశైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. జుట్టు రాలే సమస్యకు ఈ మధ్యకాలంలో కెమికల్ ఉత్పత్తుల వాడకం ఎక్కువ అయింది. .
ఇలా వాడటం వలన జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. అలా కాకుండా జుట్టు పెరుగుదలకు మన ఇంటిలో సహజ సిద్ధంగా ఉన్న పదార్థాలతో ఒక జ్యూస్ తయారు చేసుకుని ప్రతిరోజు తాగితే చాలా బాగా సహాయపడుతుంది. ఈ జ్యూస్ కోసం బీట్రూట్, ఉసిరి, అల్లం, కరివేపాకు ఉపయోగిస్తున్నాం. ఉసిరిలో ఉన్న పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. .
అల్లం లో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కరివేపాకు కూడా జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. కరివేపాకులో ఉన్న పోషకాలు జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. అలాగే .బీట్ రూట్ లో ఉన్న లక్షణాలు కూడా జుట్టు రాలకుండా కాపాడతాయి.
ఒక చిన్న బీట్రూట్ తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక ఉసిరికాయను ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీ జార్ లో కట్ చేసిన బీట్రూట్ ముక్కలు., 10 నుంచి 12 కరివేపాకులు, ఉసిరికాయ ముక్కలు ,ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం, సరిపడా నీటిని పోసి మిక్సీ చేయాలి.
ఈ మిశ్రమాన్ని పల్చని వస్త్రం సాయంతో వడగట్టాలి. ఇలా తయారుచేసిన జ్యూస్ ను ప్రతిరోజు తాగడం వలన జుట్టు కుదుళ్లు బలోపేతం అయ్యి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. ఈ జ్యూస్ తాగడం వలన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే స్కాల్ప్‌లో రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. సాధారణంగా జుట్టు పెరిగే వేగంతో పోలిస్తే ఈ జ్యూస్ తాగినప్పుడు ఐదు రెట్లు వేగంగా జుట్టు పెరుగుతుందని అంటున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.