మాస్ సినిమాను ఎంత మంది హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా ?

Mass Telugu Full Movie :ఓ పక్క డిజాస్టర్ మూవీస్ తో నాగార్జునను నిరాశ వెంటాడుతుంటే, పవన్ కళ్యాణ్ ఖుషి లాంటి మూవీస్ తో రైజింగ్ లో ఉన్నాడు. తనకిలాంటి స్థితి ఏమిటి అనుకుంటున్నా సమయంలో 2002లో సంతోషం, మన్మధుడు వంటి హిట్స్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు.

తర్వాత పూరి జగన్నాధ్ తీసిన శివమణి కూడా హిట్ అయింది. నేనున్నాను క్లాసికల్ మూవీ చేసి హిట్ కొట్టాడు. మంచి జోరుమీదున్న నాగ్ ని కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ కల్సి డైరెక్ట్ చేయాలని ఉందని చెప్పాడు. కొత్త వాళ్లను ప్రోత్సహించే నాగ్ వెంటనే కథ చెప్పమన్నాడు. లారెన్స్ కథ చెబుతుంటే ఎక్కడా ఆపమని చెప్పడానికి వీలులేకుండా ఉండడంతో మొత్తం విని ఫ్లాట్ అయ్యాడు.

శివ సినిమా సమయంలో వర్మ కథ చెబితే ఎలా ఉందో అలా అన్పించడం తో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద తీయాలని నిర్ణయించాడు. మీడియాకు కూడా తన తదుపరి మూవీ లారెన్స్ తో అని కూడా ప్రకటించేశాడు. నిజానికి రజనీకాంత్, చిరంజీవిలకు ఈ కథ చెప్పగా , విముఖత చూపడంతో విజయ్ తో చెప్పాలనుకుంటున్న సమయంలో నాగ్ కన్పించాడు.

ఒకే చెప్పడంతో ఇష్టమైన రాఘవేంద్ర స్వామిని తలచుకుని నాగ్ కి దణ్ణం పెట్టాడు. ఎందరో డైరెక్టర్స్ రెడీగా ఉండగా, నాగ్ ఇలా చేశాడేంటి అని అందరూ చెవులు కొరుక్కున్నారు. గురి కుదిరితే ఎంతటి రిస్క్ అయినా చేయడం నాగ్ కి అలవాటు కదా. హీరోయిన్ గా ఛార్మి, ఫ్లాష్ బ్యాక్ కోసం జ్యోతికను సెలెక్ట్ చేసారు.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. నాగ్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో సునీల్ సెలక్ట్ హైలెట్. రఘువరన్ , రాహుల్ దేవ్ లను విలన్ గా తీసుకున్నాడు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు. ధర్మవరపు, జీవా, వేణుమాధవ్, సమీర్ తదితరుల తారాగణం. చిన్న రోల్ కి ప్రకాష్ రాజ్ ఒకే. మే 7న నేనున్నాను రిలీజై, హిట్ కావడంతో మే మూడవ వారంలో హుషారుగా షూటింగ్ స్టార్ట్.

సారధిలో కొంత తీసాక, అన్నపూర్ణలో సెట్ వేసి షూట్ చేసారు. రామోజీఫిలిం సిటీలో ఫ్లాష్ బ్యాక్, గోవాలో ఛేజింగ్ సీన్స్ తీశారు. 85 డేస్ లో షూటింగ్ పూర్తి. వంశి పైడిపల్లి అసోసియేట్ డైరెక్టర్. నవంబర్ 25న ఆడియో రిలీజ్. అక్కినేని, అఖిల్, సుమంత్ తదితరులు వచ్చారు. ఆడియో హిట్. డిసెంబర్ 23న 190కి పైగా ప్రింట్స్ తో మాస్ రిలీజ్.

ఎమోషన్ జోడించి చేసిన మాస్ మూవీ ఆడియన్స్ ఆకట్టుకుని, భారీ ఓపెనింగ్స్ తెచ్చింది. లారెన్స్ టాలెంట్ బయటపడింది. ముఖ్యంగా సునీల్ పాత్ర బాగా కనెక్ట్ అయింది. డేట్స్ ఇచ్చి విలన్ ని భయపెట్టడం వంటి సీన్స్ అదరగోట్టాయి. వసూళ్లు కూడా సూపర్భ్. అన్నపూర్ణ బ్యానర్ లో హ్యాట్రిక్.