ఈ ఆయిల్ తో మసాజ్ చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి 3 రెట్లు వేగంగా జుట్టు పెరుగుతుంది

Hair growth Home Remedies In Telugu : ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య, జుట్టు చిట్లిపోవటం, చుండ్రు వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే మనలో చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే నూనెలను,షాంపూలను వాడేస్తూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
hair fall tips in telugu
వాటిని వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులను ఉపయోగించి చాలా సులువుగా జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడవచ్చు. ఈ రెమిడీ కోసం అరకప్పు బాదం పప్పు తీసుకోవాలి. బాదంలో ఉండే ప్రోటీన్ దెబ్బతిన్న జుట్టు తంతువులను రిపేర్ చేస్తుంది.
Diabetes patients eat almonds In Telugu
అంతేకాకుండా చనిపోయిన మృతకణాలను తొలగించి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. బాదంలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ స్కాల్ప్‌కు తేమను మరియు పోషణను అందించి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. నిర్జీవమైన జుట్టును రిపేర్ చేస్తుంది. బాదం పప్పును కచ్చా పచ్చాగా దంచాలి.
9 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని తొక్క తీసి కచ్చా పచ్చాగా దంచాలి.
garlic
వెల్లుల్లిలో సల్ఫర్ సమృద్దిగా ఉండుట వలన స్కాల్ప్‌కు పోషణ అందించి జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు చిట్లకుండా జుట్టు పెరగటానికి సహాయపడుతుంది. ఒక గాజు సీసాలో 200 ML ఆలివ్ నూనె తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ జుట్టు మరియు చర్మం రెండింటినీ మాయిశ్చరైజ్ చేయడం ద్వారా చుండ్రును తొలగిస్తుంది.

ఇది స్కాల్ప్‌లో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, మరింత ఆక్సిజన్ వెళ్ళేలా చేస్తుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది మరియు చుండ్రు సమస్యను తొలగిస్తుంది. ఆలివ్ ఆయిల్ లో కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి,బాదంలను వేసి 30 నిమిషాల పాటు డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేయాలి.
Hair Care
ఈ నూనె చల్లారాక సీసాలో ఫిల్టర్ చేయండి. ఈ నూనెను ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా నెల రోజులు నిల్వ ఉంటుంది. ఫిల్టర్ చేసిన తర్వాత బాదం మరియు వెల్లుల్లిని సలాడ్లు మరియు సూప్ లలో వాడుకోవచ్చు. ఇది వంటకు రుచిని మరియు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి 2 నిమిషాలు మసాజ్ చేయాలి.

స్కాల్ప్‌కు అప్లై చేసినప్పుడు, రక్త ప్రసరణను వేగవంతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. చుండ్రు సమస్యను తొలగిస్తుంది. గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య, చుండ్రు, జుట్టు చిట్లిపోవటం వంటి సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే తెల్లజుట్టును నల్లగా మార్చుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.