నాన్నతో స్టెప్స్‌ వేసేందుకు ఎన్ని టేక్‌లు తీసుకున్నాడో తెలుసా?

వెండితెరకు పది సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా చిరు డ్యాన్స్‌లలో గ్రేస్‌ ఏ మాత్రం తగ్గలేదు. ‘ఖైదీ నంబర్‌.150’లో ఇప్పటి హీరోలకు పోటీనిస్తూ ఆయన పలికించిన భావాలపై ఎంతోమంది ప్రశంసలు కూడా కురిపించారు. ఇదిలా ఉంటే ఖైదీలోని ‘అమ్మడు కుమ్ముడు’ సాంగ్‌లో రామ్‌చరణ్‌ కూడా కెమెరా అప్పియరెన్స్‌ ఇచ్చి ప్రేక్షకులకు మరింత ఊపును ఇచ్చాడు.

అయితే ఇందులో చిరుతో కలిసి స్టెప్‌లు వేసేందుకు చరణ్‌ 15టేక్‌లు తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చాడు. ఇందులో తాను అప్పియరెన్స్‌ ఇస్తానని అనుకోలేదని, అయితే అమ్మడు కుమ్ముడు సాంగ్‌లో స్టెప్స్‌ వేసేందుకు నాన్నే అడిగారని, కానీ ఆ స్పీడును, గ్రేస్‌ను అందుకోవడానికి తాను పదిహేను టేక్‌లు తీసుకున్నానని తెలిపాడు.