మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసా…?

Rudraksha : శివానుగ్రహానికి రుద్రాక్ష ఎంతో మంచిదని చెబుతారు. పైగా రాశుల వారీగా ఎవరు ఏ రకం రుద్రాక్ష పూజించి ధరిస్తే మంచిదో కూడా పండితులు చెబుతారు. చాలామంది జాతకాలను నమ్మేవాళ్ళు , సెంటిమెంట్స్ నమ్మేవాళ్ళు ఇలాంటి వాటిని ఆచరణలో పెట్టడం చూస్తూనే ఉన్నాం.

అయితే రాశుల వారీగా చూస్తే, మేష రాశి వాళ్ళు అదృష్టం కోసం ఏక ముఖి, త్రిముఖి, పంచముఖి రుద్రాక్షలలో ఏదో ఒకటి ధరిస్తే మంచిదంటారు. వృషభ రాశి వారు సుఖ సంతోషాల కోసం చతుర్ముఖ, షట్ ముఖాలు /పద్నాలుగు ముఖాలు గల రుద్రాక్షలను ధరిస్తే మంచిదని అంటారు. మిథున రాశి వాళ్ళు చతు ర్ముఖ, పంచముఖ, 13 ముఖాల రుద్రాక్షలలో ఏదో ఒకటి ధరిస్తే మంచిదంటారు

కర్కాటక రాశి వాళ్ళైతే త్రిముఖి, పంచముఖ/ గౌరీ-శంకర్ రుద్రాక్షలను ధరిస్తే మంచిందని చెబుతారు. సింహ రాశి వారి అదృష్టాన్ని పెంచడానికి ఏక ముఖి, మూడు కియా ముఖి, పంచముఖి రుద్రాక్షలను ధరిస్తే మంచిదంటారు. కన్యా రాశి వారైతే చతుర్ముఖి, పంచముఖి, 13 ముఖాల రుద్రాక్షను ధరించడం చాలా మంచిదని అంటారు.

తులారాశి వాళ్ళు అదృష్టాన్ని పొందడానికి చతుర్ముఖి, షట్ముఖి / 14 ముఖాల రుద్రాక్షలను ధరించడం శుభదాయకమని అంటారు. వృశ్చిక రాశి వాళ్ళు వ్యక్తి తన నిద్రావస్థను మేల్కొల్పడానికి త్రిముఖి, పంచముఖి /గౌరీ-శంకర్ రుద్రాక్షను ధరించడం మంచిదని అంటారు. ధనుస్సు రాశి వాళ్ళు తమ అదృష్టాన్ని పెంచుకోవడానికి ఏక ముఖి, త్రిముఖి/ పంచ ముఖి రుద్రాక్షలను ధరించడం శుభప్రదంగా చెబుతారు.

మకర,కుంభ రాశి వాళ్ళు తమ అదృష్టాన్ని పెంచుకోవడానికి చతుర్ముఖి, షట్ముఖి/ 14 ముఖాల రుద్రాక్ష ధరించడం శుభప్రదంగా చెబుతారు. మీన రాశి వాళ్ళైతే త్రిముఖి, పంచముఖి /గౌరీ-శంకర్ రుద్రాక్షలను ధరించడం ఉత్తమమని అంటారు.