ఈ ఆకును దంచి పెరుగులో కలిపి జుట్టుకి పట్టిస్తే జీవితంలో చుండ్రు, జుట్టు రాలే సమస్య ఉండదు

Tamarind leaves Beauty Benefits In telugu : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది చుండ్రు, జుట్టు రాలే సమస్య వంటి అనేక రకాల జుట్టుకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు, ఈ సమస్యలు ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. జుట్టు రాలే సమస్యకు., చుండ్రు సమస్యకు చింత ఆకులు చాలా బాగా సహాయపడతాయి.
Tamarind Leaves Benefits
జుట్టు సంరక్షణలో చింత ఆకులు ఎలా సహాయపడతాయో చూద్దాం. చింత ఆకులలో యాంటీ డాండ్రఫ్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన బ్యాక్టీరియాతో పోరాటం చేసి చుండ్రు అలాగే స్కాల్ప్ ఇన్ఫెక్షన్ తొలగించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.
curd benefits in telugu
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి గుప్పెడు చింత ఆకులను శుభ్రంగా కడిగి వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ నీటిని వడగట్టి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. చింత ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి పెరుగు కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి.
Honey
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు, జుట్టు రాలే సమస్య తొలగిపోయి జుట్టు ఒత్తుగా పొడవుగా కాంతివంతంగా మెరుస్తూ పెరుగుతుంది. చింత ఆకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

చింత ఆకులు సహజసిద్ధమైన కలరింగ్ ఏజెంట్ గా పని చేస్తాయి. అందువలన తెల్ల జుట్టు సమస్య ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చింతాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొంతమంది జుట్టు చూడటానికి నిస్తేజంగా కనబడుతుంది. అలా నిస్తేజంగా కనపడిన జుట్టును కాంతివంతంగా మెరిసేలా చేయడానికి చింత ఆకు చాలా బాగా సహాయపడుతుంది. .
hair fall tips in telugu
చింత ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి తేనె కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తుంది. సిల్కీగా ఉంటుంది. చింత ఆకులలో ఫ్లేవనాయిడ్స్ మరియు పాలీఫెనాల్స్ ఉండటం జుట్టు నాణ్యతను పెంచుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.