Kitchenvantalu

ఈ సూప్ రక్తహీనత,అధిక బరువు తగ్గించటమే కాకుండా సీజనల్ సమస్యలు లేకుండా చేస్తుంది

Weight loss Carrot Ginger soup In Telugu : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా లేదంటే వచ్చిన సమస్యలు తగ్గాలన్నా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా అధిక బరువు,రక్తహీనత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
Carrot
ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఇప్పుడు చెప్పే సూప్ బాగా సహాయపడుతుంది. ఈ సూప్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. ఈ సూప్ లో ఉపయోగించే అన్నీ ఇంగ్రిడియన్స్ మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. పొయ్యి మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి.
Ginger benefits in telugu
ఆ తర్వాత ఒక బిరియాని ఆకు, 5 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి వేయాలి. ఆ తర్వాత ఆరంగుళం అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత అరస్పూన్ మిరియాలు వేసి ఒక నిమిషం వేగించాలి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 300 గ్రాముల క్యారెట్ ని శుభ్రం కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.

3 లేదా 4 నిమిషాల పాటు వేగాక అరలీటర్ నీటిని పోసి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. ఉడికిన ఈ మిశ్రమాన్ని నీటితో సహ మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో 300 Ml నీటిని పోసి వడకడితే సూప్ తయారవుతుంది. ఈ సూప్ ని పొయ్యి మీద ఒక పొంగు వచ్చేవరకు మరిగించాలి.
Onion benefits in telugu
ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక పొంగు వచ్చాక బౌల్ లో సర్వ్ చేసుకోవటమే. ఈ సూప్ ని వారంలో రెండు సార్లు తీసుకుంటే రక్తహీనత,అధిక బరువు వంటి సమస్యలు తగ్గటమే కాకుండా సీజనల్ గా వచ్చే సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ సీజన్ లో ఈ సూప్ తయారుచేసుకొని తాగటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.