Devotional

ఆడవారు పుట్టిన నెలను బట్టి వారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసా ?

women astrology birth prediction based on birth month : ఆడవారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం సముద్రం లోతు తెలుసుకోవడం ఆడవారి మనసును అర్థం చేసుకోవడం రెండు ఒకటే. పుట్టిన నెలను బట్టి వారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూద్దాం

జనవరి నెలలో పుట్టిన వారు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అంతేకాకుండా ప్రతిభావంతులుగా ఉంటారు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు చెడుగా మాట్లాడితే అస్సలు సహించలేరు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి

ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు జాలి దయ ప్రేమ అభిమానం ఎక్కువ కలిగి ఉంటారు .వీరు చాలా అదృష్టవంతులు వీరి గురించి ఎదుటివారు ఏమి మాట్లాడినా అస్సలు పట్టించుకోరు. ఎవరైనా మోసం చేస్తే అస్సలు సహించరు.

మార్చి నెలలో పుట్టిన వారు ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడతారు. ధైర్యం చాలా తక్కువగా ఉంటుంది.

ఏప్రిల్ నెలలో పుట్టిన వారు శాంతంగా అందంగా అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఎంత కష్టమైనా పని అయినా ఈజీగా చేస్తారు. అసూయ కూడా ఎక్కువగానే ఉంటుంది

మే నెలలో పుట్టిన వారు కొంచెం కోపం కలిగి ఉంటారు. కానీ వీరికి కోపం క్షణాల్లో తగ్గిపోతుంది. చాలా కఠినంగా ఉంటారు ప్రేమలో పడటం చాలా కష్టం.

జూన్ లో పుట్టిన వారు సృజనాత్మకత శాంత స్వభావం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా కలిగి ఉంటారు వీరిది సిగ్గుపడే స్వభావం. ఏదైనా మాట్లాడాలి అంటే ముందు వెనక ఆలోచిస్తారు.

జులై నెలలో పుట్టిన వారు అందంగా ఆకర్షణీయంగా నిజాయితీగా ఉంటారు. గొడవలకు అస్సలు వెళ్లరు. బంధాలకు విలువ ఇస్తారు.

ఆగస్టు నెలలో పుట్టిన వారు చాలా హుషారుగా కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు జీవిత భాగస్వామిని వారే వెతుక్కొని వారిని సాధించేవరకూ కష్టపడతారు.

సెప్టెంబర్ నెలలో పుట్టిన వారిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. వీరు చాలా అమాయకంగా ఉంటారు భాగస్వామి విషయంలో సున్నితమైన మనస్తత్వం కలవారై ఉండాలని కోరుకుంటారు

అక్టోబర్ నెలలో పుట్టిన వారు అందంగా అమాయకంగా ఉండి ఎదుటి వారి మనసును నొప్పించరు. జాలి దయ కరుణ ఎక్కువగా ఉంటాయి

నవంబర్ నెలలో పుట్టిన వారు అందంగా తెలివిగా ఉంటారు అన్నింటిలోనూ అందరికంటే ముందు ఉండాలని కోరుకుంటారు అబద్ధం చెబితే వెంటనే పసిగడతారు

డిసెంబర్ నెలలో పుట్టిన వారు ఏ విషయాన్ని అయినా చక్కగా డీల్ చేస్తారు. ఓపెన్ గా మాట్లాడుతారు ఎలాంటి పరిస్థితి అయిన తట్టుకునే శక్తి కలిగి ఉంటారు.