గీతాంజలి టైటిల్ వెనుక ఎంత పెద్ద కథ నడిచిందో తెలుసా ?
Geethanjali movie heroine :అక్కినేని నట వారసుడిగా నాగార్జున ఎంట్రీ ఇచ్చాక లవ్ స్టోరీ మూవీతో కెరీర్ మలుపు తిప్పిన మూవీ గీతాంజలి. గిరిజ హీరోయిన్ గా చేసిన ఈ మూవీ అప్పట్లో ఓ సంచలనం. ఇలాంటి మంచి సినిమా చేసినందుకు నాగార్జునను ఫాన్స్ ఒక్కరే కాదు, అందరూ మెచ్చుకున్నారు.
మణిరత్నం డైరెక్ట్ చేసిన ఒకే ఒక తెలుగు సినిమా ఇదే. ఇక ఈ సినిమాలో గిరిజ డ్రెస్‌లు అమ్మాయిలకు తెగ నచ్చేసింది. అప్పట్లో ఇలాంటి దుస్తులు ఏరి కోరి తెప్పించుకునేవారట. 42 ప్రింట్స్‌తో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు, తెలుగు సినిమాల్లో ఓ క్లాసిక్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.
అసలు ఈ కథకు మణిరత్నం ఎక్కడ నుండి ప్రేరణ పొందారని విషయంలోకి వెళ్తే, మంచి ఆసక్తి రేకెత్తిస్తుంది. వాస్తవానికి నాగార్జునతో సినిమా చేయాలని మణిరత్నం అనుకున్నాక, డైయింగ్ యంగ్ సినిమా స్ఫూర్తిగా ఓ కథను అనుకున్నారు. ఇందులో జూలియా రాబర్ట్ నటించారు. సాధారణంగా హీరోకో, హీరోయిన్‌కో క్యాన్సర్ ఉండడం, సినిమా విషాదంతో ముగిసే కథలనే చూసుంటారు.
అయితే మణిరత్నం సినిమాలో హీరోకి , హీరోయిన్‌కి క్యాన్సర్ ఉంటుంది. ఇక ఈ సినిమాకు ఏ టైటిల్‌ను పెట్టాలా అని మణిరత్నం బాగా ఆలోచిస్తున్నారట. ఆ సమయంలో మణిరత్నం ఓ పుస్తకం చదివారు. అందులో ఢిల్లీకి చెందిన 11 ఏళ్ల అమ్మాయి క్యాన్సర్ బారిన పడింది. ఆ అమ్మాయి తన మానసిక వేదనను కవిత రూపంలో ఓ పుస్తకంగా రాసింది.
అది చదివిన మణిరత్నం చలించిపోయి, తన సినిమాకు గీతాంజలి అనే పేరు పెట్టారు. అలా హీరోయిన్ పేరునే ఈ సినిమాకు మణిరత్నం ఫిక్స్ చేశారు. మణిరత్నం వంటి దర్శకుడు చెప్పడంతో నాగార్జున ఒకే అనేశాడు. సినిమా కథ ఓకే అయ్యింది. అయితే హీరోయిన్‌గా ఎవరిని పెట్టాలా? అని మణిరత్నం తెగ వెతకడం ప్రారంభించారు.
ఇక అదే సమయంలో మణిరత్నం, సుహాసినిల పెళ్లి జరగడం, క్రికెటర్ శ్రీకాంత్ కుటుంబంతో వచ్చిన ఓ అమ్మాయి బావుందని మణిరత్నంకు అనిపించడం, వెంటనే ఆమెను సంప్రదించి ఓకే చేయించుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆమె హీరోయిన్ గిరిజ. ఆమెకు తెలుగు రాకపోవడంతో సీనియర్ అసోసియేట్ డైరెక్టర్‌తో డైలాగ్స్ పలకడంలో మణిరత్నం ట్రైనింగ్ ఇప్పించారు.
ఇక మద్రాసులో సినిమా ప్రివ్యూ వేస్తె, చూసిన వారంతా ఇదేం సినిమా అని పెదవి విరిచారు. డిజాస్టర్ అనుకున్న సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాదు, ఇండస్ట్రీని నివ్వెరపోయేలా చేసింది. ఇక ఇందులో వేసిన గిరిజ కన్నడంలో హృదయాంజలి అనే సినిమా తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై కొట్టేసింది.