ఆస్తమా ఉన్నవారు అల్లం తింటే ఏమి అవుతుందో తెలుసా…ముఖ్యంగా ఈ సీజన్ లో…
Asthma Home remedies in telugu : ఈ చలికాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. వాటిలో ఉబ్బసం,ఆస్తమా వంటివి కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు ఈ సీజన్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలను తీసుకుంటే ఆస్తమా నుండి ఉపశమనం పొందవచ్చు.
ఉబ్బసం, ఆస్తమా అనేవి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు. ఈ సమస్యలు ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మందులు వేసుకుంటున్నా ఒక్కసారి ఇబ్బందిగా ఉంటుంది. ఇది ప్రాణాంతకం కాక పోయినా,తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు,చనిపోయిన బాగుండేది అని చాలా మందికి అన్పిస్తుంది. దీన్ని పూర్తిగా తగ్గించటానికి మందు లేకపోయినా,దీని తీవ్రతను తగ్గించటానికి మాత్రం మందులు ఉన్నాయి. ప్రతిసారి మందులు వాడకుండా ఇంటిలో మీకు అందుబాటులో ఉండే పదార్దాలతో ఆస్తమా పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.
ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది. చిన్న అల్లం ముక్కను తీసుకోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో తేనేతో కలిపి తీసుకోవాలి. అల్లంలో ఉండే లక్షణాలు ఉబ్బసం, ఆస్తమా తగ్గించటానికి సహాయపడతాయి. ఈ విధంగా ప్రతి రోజు తీసుకుంటూ ఉంటె మంచి ప్రయోజనం కనపడుతుంది.
ఇంటి చిట్కాలు సమర్ధవంతంగా పనిచేస్తాయి. అల్లం మనకు వంటగదిలో సులుభంగా అందుబాటులో ఉంటుంది. అలాగే తేనె ఆర్గానిక్ తేనె వాడితే మంచిది. వాతావరణం మారుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి. ఈ విధంగా కెఃయటం వలన దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటి వాటి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.