ఈ చిట్కా పాటిస్తే చాలు కేవలం 3 రోజుల్లోనే పాదాల పగుళ్లు మాయం అయ్యి మృదువుగా మారతాయి
Crack heels Home Remedies In telugu : పాదాల పగుళ్లు అనేవి ఈ చలికాలంలో మనలో చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. పాదాల పగుళ్లు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చలికాలం వచ్చిందంటే చాలు కాళ్ళ పగుళ్ళతో పాదాలు అందవిహీనంగా మారిపోతూ ఉంటాయి.
అంతేకాకుండా పాదాల పగుళ్లు వచ్చినప్పుడు నడిచినప్పుడు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. పాదాల పగుళ్లు రావటానికి చలి, తేమ సరిగా లేకపోవడం, డయాబెటిస్, థైరాయిడ్, పాదాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వంటి అనేక రకాల కారణాలు ఉంటాయి. పాదాల పగుళ్లు వచ్చినప్పుడు పెద్దగా ఖర్చు పెట్టకుండా మనకు అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. పాదాల పగుళ్లకు ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. వేప ఆకులు పాదాల పగుళ్లను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. వేపలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీపారసిటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన వేప ఆకులను బ్యూటీ ప్రొడక్ట్స్ లలో ఎక్కువగా వాడుతున్నారు. .
వేప ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ పేస్టు తీసుకుని దానిలో పావు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజూ చేస్తూ ఉంటే పాదాల పగుళ్లు క్రమంగా తగ్గుతాయి. .
అయితే ఈ పాదాల పగుళ్ళు ప్రారంభంలో ఉన్నప్పుడే ఈ చిట్కాను ఫాలో అయితే చాలా తొందరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. వేప, పసుపులో ఉన్న గుణాలు పాదాల పగుళ్లను చాలా వేగంగా తగ్గిస్తాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి ఈ చలికాలంలో పాదాల పగుళ్ళ సమస్య నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.