Beauty Tips

Hair Care Tips:ఈ గింజలతో ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది

Rice Hair Growth Home Remedies In telugu : జుట్టు రాలే సమస్య ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనబడుతుంది. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సరిగా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, కాలుష్యం, ఆహార అలవాట్లు వంటి ఎన్నో రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య వస్తుంది.

కారణం ఏదైనా జుట్టు రాలే సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనలో చాలా మంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు, నూనెలు వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. .

అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులతో చాలా సమర్థవంతంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పే రెమెడీ ఫాలో అయితే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా చుండ్రు వంటి సమస్యలు కూడా ఉండవు. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోయాలి.

నీరు కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల మెంతులు., రెండు స్పూన్ల కలోంజి సీడ్స్, రెండు స్పూన్ల బియ్యం వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని స్ట్రైనర్ సాయంతో ఫిల్టర్ చేయాలి. ఈ వాటర్ లో ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి.

ఆ తర్వాత ఒక గంట అయ్యాక గోరువెచ్చని నీటితో కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాల సమస్య., చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. ఈ రెమిడీ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కాస్త ఓపిక,శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.