బొమ్మరిల్లు సినిమా సిద్ధార్ద్ కంటే ముందు ఏ హీరో వద్దకు వెళ్లిందో తెలుసా?

ఇండస్ట్రీలో అన్ని వర్గాలను అలరించే సినిమాలు అరుదుగా ఉంటాయి. అందులో బొమ్మరిల్లు మూవీ ఒకటి. సిద్ధార్ధ,జెనీలియా జంటగా నటించిన ఈ సినిమాను భాస్కర్ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ అయ్యాడు. ఇక హీరో హీరోయిన్స్ కే కాకుండా ఇందులో నటించిన నటీనటులందరికీ ఈ మూవీ మంచి ఇమేజ్ తెచ్చింది. సినిమాలో డైలాగ్స్ పేలాయి.

పాటలు అదిరాయి. కుదిరితే కప్పు కాఫి వీలయితే నాలుగు మాటలు,ఇంతేనా వంటి డైలాగ్స్ ఇప్పటికీ జనం హృదయాల్లో ఉన్నాయి. 2004లో దిల్ రాజు నిర్మాతగా ఆర్య సినిమా షూటింగ్ 50షాట్స్ వరకు మిగిలి ఉండడంతో టెన్షన్ నెలకొంది. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న ఓ కుర్రాడు దిల్ రాజు దగ్గరకొచ్చి ఎలాంటి టెన్షన్ వద్దని, షూటింగ్ కంప్లిట్ అవుతుందని చెప్పాడు. అతడే భాస్కర్.

ఆవిధంగా డైరెక్టర్ సుకుమార్ తో కల్సి ప్లాన్ చేసి,ఒక్కరోజులో అన్ని షాట్స్ తీసేసారు. నిజానికి దిల్ రాజు, సుకుమార్ ఒకరి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్స్ గా చేయడం వలన మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇక వీరిద్దరికీ భాస్కర్ పనితనం నచ్చి, ఓ స్టోరీ రెడీ చేసుకుంటే సినిమా ఛాన్స్ ఇస్తానని దిల్ రాజు చెప్పాడు. ఇక భద్ర మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న భాస్కర్ ఓ కథ రెడీ చేసాడు.

ఎప్పుడో 1997లో ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ సమయంలో రాసుకున్న కథ అది. దిల్ రాజుకి తెగనచ్చడంతో ఫుల్ స్టోరీ ప్రిపేర్ చేయమన్నాడు. జోష్ మూవీ డైరెక్టర్ వాసు వర్మతో కల్సి స్క్రిప్ట్ రెడీ చేసాడు.జూనియర్ ఎన్టీఆర్ ,అల్లు అర్జున్ లను హీరోలుగా పెట్టాలని చూస్తే ఇద్దరూ ఒప్పుకోకపోవడంతో సిద్దార్ధ ను ఎప్రోచ్ కావడం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా సాగాయి.

హీరోయిన్ గా సింధు తులాని పేరు దిల్ రాజు ప్రపోజ్ చేయగా, హ్యాపీ మూవీ సమయంలో చూసిన జెనీలియా కళ్ళు బాగుంటాయని ఆమె తన హీరోయిన్ అని భాస్కర్ చెప్పేసాడు. జయసుధని కూడా ఒప్పించాడు. వైవిఎస్ చౌదరి అదే సమయంలో బొమ్మరిల్లు బ్యానర్ ఓపెన్ చేయడం,దాని ఇన్విటేషన్ దిల్ రాజు ఆఫీసులో కనిపించడంతో అదే టైటిల్ అయింది. 8కోట్ల బడ్జెట్ తో 120రోజుల షూటింగ్ ప్లాన్ చేస్తే,105రోజుల్లోనే పూర్తిచేసాడు.

శ్రీకాంత్ అడ్డాల ,సప్తగిరి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా చేసారు. చివరి సన్నివేశం ఏకంగా నాలుగున్నర నిముషాలు ,ఎక్కడా కట్ చెప్పకుండా తీసి,సీన్ అయినా సరే భాస్కర్ ఏడుస్తూ ఉండిపోయాడట. 25కోట్ల షేర్ కలెక్ట్ చేసి సంచలనం క్రియేట్ చేసింది. ఓవర్సీస్ లో 3న్నర కోట్లు వసూలు చేసి అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది.