రాత్రి సమయంలో బెల్లం కలిపిన పాలను తాగితే ఊహించని ప్రయోజనాలు
Milk And jaggery Health benefits In telugu : ఈ సీజన్ లో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను తగ్గించుకోవాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. మనం సాధారణంగా పాలను తాగుతూ ఉంటాం. పాలను పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తాగుతూ ఉంటారు. అయితే మనలో చాలామంది పాలలో పంచదార వేసుకొని తాగుతూ ఉంటారు. .
అలా కాకుండా బెల్లం వేసుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర స్పూన్ బెల్లం పొడి వేసి బాగా కలిపి తాగితే ఎన్నో రకాల సమస్యల నుంచి బయట పడవచ్చు. రాత్రి సమయంలో తాగితే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి సమయంలో ఈ పాలను తాగాలి. ఉదయం సమయంలో తాగితే అలసట., నీరసం, నిస్సత్తువ వంటివి ఏమీ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. అలాగే జీవక్రియ రేటును మెరుగుపరిచి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి అజీర్ణం., గుండెల్లో మంట, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది.
పాలు, బెల్లం రెండింటిలోనూ calcium సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో బలహీనతను దూరం చేస్తుంది. అలాగే కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. వీటిలో ఉండే విటమిన్ ఏ, డి, జింక్, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఈ సీజన్ లో వచ్చే అన్ని రకాల సమస్యలను తగ్గిస్తాయి.
బెల్లం పాలు బరువును తగ్గించటానికి సహాయపడతాయి. బెల్లంలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, ఇది శరీరం యొక్క జీవక్రియ రేటును మెరుగుపరచడంలో మరియు కండరాలను నిర్మించడంలో మరింత సహాయపడుతుంది.
బెల్లంలో ఉండే పొటాషియం మరియు సోడియం శరీరంలోని యాసిడ్స్ స్థాయిని మెయింటెన్ చేయడంలో సహాయపడతాయి. బెల్లం మరియు పాలు తీసుకోవడం రక్తపోటు స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. బెల్లంలో ఉండే సెలీనియం శరీరంలోని ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేసి చర్మం యవన్నంగా ఉండటానికి సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.