ఈ హీరోల ఫస్ట్ మూవీస్ గురుంచి మీకు తెలీని ఆసక్తికర విషయాలు

తెలుగు ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతోంది. అయితే కొందరి వారసులను లాంచ్ చేయడానికి ముందుగా ఒకర్ని అనుకుని, తర్వాత చేంజ్ చేసిన సందర్భాలు చాలామంది విషయంలో జరిగిందట. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు విషయం తీసుకుంటే, ఎస్వీ కృష్ణారెడ్డి ద్వారా లాంచ్ చేయాలని చూశారట. యమలీల మూవీ అందుకోసమే అనుకున్నారట.

అయితే మహేష్ చదువు దృష్ట్యా ఆ ప్రాజెక్ట్ ని కృష్ణ రద్దు చేశారట. అయితే కృష్ణ వంశీ ద్వారా ఇంటర్డ్యూస్ చేయాలనీ కృష్ణ భావించి చర్చలు జరిపారట. తొలిసినిమా అంటే ఫాన్స్ లో ఎక్కువ అంచనాలుంటాయని అందుకే తాను చేయలేనని కృష్ణవంశీ చెప్పేయడంతో,రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రాజకుమారుడు మూవీ ద్వారా మహేష్ ని లాంచ్ చేసారు.

ఇక రామ్ చరణ్ తో ఫస్ట్ మూవీ ఎస్ ఎస్ రాజమౌళి చేయాల్సి ఉంది. స్వయంగా జక్కన్న ఈవిషయం ప్రకటించడం,చిరు అంగీకరించడం జరిగాయి. అయితే మాస్ అప్పీల్ రావడం కోసం పోకిరి,దేశముదురు మూవీస్ చేసిన పూరి జగన్నాధ్ కి చెర్రీని లాంచ్ చేసి బాధ్యత చిరంజీవి స్వయంగా అప్పగించడంతో చిరుత మూవీ వచ్చింది.

అలాగే అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి జయం మూవీ తీయాలని డైరెక్టర్ తేజ భావించడం,అల్లు అరవింద్ ఒకే చెప్పడం జరిగాయి. అయితే ఏమైందో ఏమో గానీ, నితిన్ హీరో అయ్యాడు. దాంతో గంగోత్రి మూవీని రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చేయించి బన్నీని లాంచ్ చేసారు. ఇక రామ్ ని యువసేన మూవీతో లాంచ్ చేయాలనీ పెదనాన్న స్రవంతి రవికిశోర్ భావించాడు. రీమేక్ రైట్స్ కూడా కొన్నారు.

అయితే దేవదాసు మూవీ పనిమీద రవికిశోర్ ఆఫీస్ కి వైవిఎస్ చౌదరి వెళ్ళాడు. అనుకోకుండా అక్కడ రామ్ నటించిన ఓ షాట్ ఫిలిం చౌదరి చూసాడు. ,అప్పటికే దేవదాసుకి కొత్త స్టార్స్ కోసం వెతుకుతున్న నేపథ్యంలో రామ్ ని హీరోగా ఒకే చేసేసాడు. దాంతో దేవదాసు మూవీ రామ్ కి తొలిమూవీ అయింది. పూరి డైరెక్షన్ లో నాగచైతన్యను లాంచ్ చేయాలనీ భావించారట.

అయితే స్టోరీలో నాగార్జున కొన్ని మార్పులు చెప్పడంతో పూరి ఒప్పోకోకపోవడంతో మనస్పర్థలు పెరిగిపోయి,ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. దాంతో కొత్త డైరెక్టర్ తో జోష్ మూవీ వచ్చింది. అలాగే అఖిల్ ని మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ ద్వారా లాంచ్ చేయాలనీ నాగ్ అనుకున్నాడు. సంప్రదింపులు కూడా జరిగాయి. కానీ అల్లుడు శీను మూవీ చూసాక వినాయక్ లాంటి డైరెక్టర్ కరెక్ట్ గా సరిపోతాడని నాగ్ భావించి వినాయక్ తో అఖిల్ పేరిట మూవీ చేసాడు.