కృష్ణ,జయప్రద కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయో…?
krishna and jaya prada movies list :ఒకప్పుడు హిట్ ఫెయిర్ జంట అంటూ ఇండస్ట్రీలో ఉండేవి. హీరో హీరోయిన్స్ పాతికేసి చిత్రాలు కల్పి నటించినవి చాలా ఉన్నాయి. కానీ కృష్ణ, జయప్రద కల్సి ఏకంగా 45మూవీస్ చేసారు. ఇన్ని సినిమాలు చేయడం భవిష్యత్తులో ఎవరికీ కుదరదు.
బ్లాక్ అండ్ వైట్ లో కృష్ణ,విజయనిర్మల జంట అలరించగా, కలర్ ఫుల్ సినిమాల శకం అందునా 1980 వచ్చేసరికి కృష్ణ, జయప్రద జంట ఆడియన్స్ కి కనువిందు చేసింది. బాపు డైరెక్షన్ లో విజయా సంస్థ నిర్మించిన శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ మూవీలో కృష్ణతో తొలిసారి జయప్రద కల్సి నటించింది. అది పెద్దగా హిట్ కాలేదు.
తర్వాత మనవూరి కథ మూవీలో కల్సి నటించారు. ఇదీ ఆడలేదు. కానీ ఈనాటి బంధం ఏనాటిదో మూవీలో నటించగా, సక్సెస్ అయింది. తర్వాత దొంగలకు దొంగ మూవీ డూండి నిర్మించి కృష్ణ ఫాన్స్ కి కనువిందు చేసారు. కృష్ణ సరసన గ్లామర్ పాత్రలో జయప్రద మెప్పించింది. తర్వాత కథాబలం లేకున్నా వీరిద్దరి కాంబినేషన్ వలన అల్లరి బుల్లోడు మూవీ సక్సెస్ అయింది.
తర్వాత ఊరికి మొనగాడు మూవీ ఎంతటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీలో ఇదిగో తెల్లచీర, ఇవిగో మల్లెపూలు అనే సాంగ్ కోసం రిపీట్ ఆడియన్స్ వచ్చేవారు.ఓపక్క కృష్ణ శ్రీదేవి జంటకు ఆదరణ బాబున్నా, మరోపక్క కృష్ణ, జయప్రద జంటకు కూడా కూడా జనం జేజేలు పలికారు. ఇద్దరు కల్సి చంద్రవంశము మూవీలో నటించారు. జయప్రద సోదరుడు రామ్ కుమార్ హీరోగా వచ్చిన సినిమాకు కృష్ణ చేత జయప్రద క్లాప్ కొట్టించారు.