దగ్గు వల్ల వచ్చే కఫము, శ్లేష్మంను మందులు లేకుండా తగ్గించే అద్భుతమైన కషాయం

Cold And Cough Home Remedies In telugu : ఈ చలికాలంలో ముందుగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి తరచుగా వచ్చేస్తు ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు కంగారూ పడవలసిన అవసరం లేదు. దగ్గు,జలుబు,దగ్గు వల్ల వచ్చే కఫము,శ్లేష్మంను తగ్గించుకోవటానికి మందులతో పాటుగా కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.

సమస్య ప్రారంభంలో ఉంటే మాత్రం ఇప్పుడు చెప్పే డ్రింక్ సరిపోతుంది. కాస్త ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ చెప్పిన విధంగా మందులు వాడుతూ ఈ చిట్కా పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ రెమిడీ కోసం ఉపయోగించే అన్నీ ఇంగ్రిడియన్స్ మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి.
Black Pepper Benefits
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి రెండు అంగుళాల దాల్చినచెక్క ను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 7 లవంగాలు, రెండు అంగుళాల అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 5 మిరియాలను క్రష్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ వాము వేసి 5 నిమిషాలు మరిగించాలి.
Diabetes tips in telugu
ఈ విధంగా మరిగించటం వలన పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం అరగ్లాస్, సాయంత్రం అరగ్లాస్ మోతాదులో రెండు లేదా మూడు రోజుల పాటు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగనిరోదక శక్తి కూడా పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది.
jeelakarra Health Benefits in telugu
ఈ డ్రింక్ లో రుచి కోసం అవసరమైతే కొంచెం బెల్లం వేసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తీసుకోవాలి. మనం తీసుకున్న అన్నీ ఇంగ్రిడియన్స్ రోగనిరోదక శక్తిని పెంచేవి. ఈ డ్రింక్ ని కేవలం అరగ్లాసు మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.