Beauty Tips

జుట్టు ఎంత రాలిన 15 రోజుల్లో రెట్టింపు జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగటం ఖాయం

Hair Loss Home Remedies In Telugu : మారిన జీవనశైలి, వాతావరణంలో కాలుష్యం, జుట్టుకి సరైన పోషణ లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గించడానికి అలాగే తెల్ల జుట్టు నల్లగా మారటానికి జుట్టు రాలిపోయి బట్టతల గా మారకుండా ఉండటానికి మంచి చిట్కా తెలుసుకుందాం.
fenugreek seeds
ఈ చిట్కా చాలా పర్ఫెక్టుగా పని చేస్తుంది. చాలా మంది జుట్టు రాలడం ప్రారంభం కాగానే మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను కొనేస్తు వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. వాటి కారణంగా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అదే ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఫలితం శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతూ జుట్టు మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది.

ఒక స్పూన్ బియ్యం,ఒక స్పూన్ మెంతులు రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులు,బియ్యంలను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో ఒక స్పూన్ అల్లం రసం వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.
మెంతుల్లో ఉండే బీటా కెరోటిన్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ ఉన్నాయి.
hair fall tips in telugu
ఇవి జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేయడం లో హెల్ప్ చేస్తాయి. అంతే కాక, బీటా కెరొటిన్ వల్ల జుట్టు ఆరోగ్యం గా పెరుగుతుంది. మెంతులు జుట్టుని మాయిశ్చరైజ్ చేస్తాయి. ఇందు వల్ల జుట్టు సాఫ్ట్ గా షైనీ గా ఉంటుంది. మెంతుల్లో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వల్ల మెంతులు మంచి హెయిర్ కండిషనర్ లా కూడా పని చేస్తాయి.
dandruff
బియ్యం నీటిలో ఇనోసిటాల్ మరియు కార్బోహైడ్రేట్ ఉండుట వలన పొడి మరియు చిట్లిన జుట్టు ని నయం చేస్తుంది. బియ్యం నీటిలో ఉండే ఇనోసిటాల్ జుట్టులో పొరగా పనిచేస్తుంది… మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అదనంగా, బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది జుట్టు మూలాలను బలంగా మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.