Healthhealth tips in teluguKitchen

పాలల్లో ఇంగువ కలిపి తాగితే ఏమి అవుతుందో తెలుసా… ముఖ్యంగా గ్యాస్ సమస్య ఉన్నవారు

Hing and milk Health benefits In Telugu : మనం సాధారణంగా పాలల్లో పంచదార కలుపుకుని తాగుతూ ఉంటాం. అలా కాకుండా ఇంగువ వేసి కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సమస్యలు ఉన్నవారికి బాగా ప్రయోజనం కనబడుతుంది. జీర్ణ వ్యవస్థ సమస్యలు, ప్రేగు సంబంధిత వ్యాధులు ఉన్నవారు కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నవారికి మంచి ఉపశమనం కలుగుతుంది
Inguva Health benefits in telugu
అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు, అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు ఈ పాలను తాగితే రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి రక్త ప్రవాహం బాగా జరిగేలా చేస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేసి రక్తం చిక్కగా లేకుండా పలుచగా ఉండేలా చేస్తుంది. ఈ పాలను ఉదయం లేదా రాత్రి సమయంలో తాగవచ్చు.

ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో చిటికెడు ఇంగువ వేసి బాగా కలిపి ఉదయం లేదా రాత్రి సమయంలో తాగవచ్చు. ఇలా తాగటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
ప్రేగులను శుద్ధి చేసి పేగులు పొడిగా మారకుండా నివారిస్తుంది. అజీర్ణం, కడుపునొప్పి, వాంతులు, ఎక్కిళ్ళు, వికారం, మలబద్దకం వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.
gas troble home remedies
ప్రేగు కదలికలు బాగా జరిగి కడుపునొప్పి, గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే కాలేయంనకు ఎటువంటి సమస్యలు లేకుండా చురుగ్గా పనిచేస్తుంది. శ్వాసకోశ వ్యాధులు మరియు గొంతుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. పైల్స్ సమస్య ఉన్నప్పుడు ఈ పాలను తాగితే నొప్పి తగ్గి మంచి ఉపశమనం కలుగుతుంది.
ekkillu In English
ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో చిటికెడు ఇంగువ కలిపి తాగితే ఎక్కిళ్ళు క్షణాల్లో ఆగిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫినాలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దాంతో మన శరీరానికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.