ఈ ఆకులు అందరికీ తెలుసు… కానీ ఈ ఆకుల్లో ఉన్న ఆ రహస్యం ఎవరికీ తెలీదు
Pomegranate Leaves Health Benefits in Telugu : దానిమ్మ గింజలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దాంతో పిల్ల నుండి పెద్దవారి వరకు అందరూ దానిమ్మ గింజలను ఇష్టంగా తింటారు. అలాగే దానిమ్మ ఆకులలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలియదు.
పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను, దానిమ్మ బెరడును ఉపయోగిస్తున్నారు. చలికాలంలో జలుబు, దగ్గు సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని పోసి దానిలో శుభ్రంగా కడిగిన 6 దానిమ్మ ఆకులను వేసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టి ఉదయం, సాయంత్రం తీసుకుంటే దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.
అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు దానిమ్మ ఆకుల కాషాయం తాగితే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా అధిక బరువు సమస్య, చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు, నోటిలో పుండ్లు తొలగిపోతాయి. దానిమ్మ ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగించి సమస్యను తగ్గిస్తుంది. దానిమ్మ ఆకులను మెత్తని పేస్ట్ లా చేసి ముఖానికి పట్టిస్తే నల్లని మచ్చలు,మొటిమలు తగ్గుతాయి.
అలాగే చర్మానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. దానిమ్మ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని మూడు గ్రాములు తీసుకొని వేడి నీటిలో కలిపి తాగితే కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, వాంతులు వంటి సమస్యలు తొలగిపోతాయి. మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్నవారు రోజుకు రెండు స్పూన్ల దానిమ్మ ఆకుల రసాన్ని తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.