Beauty TipsHealthhealth tips in telugu

1 spoon పొడి – వేగంగా బరువు తగ్గటమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

Weight Loss Powder in Telugu: మన వంటింటిలో ఉండే ఎన్నో ఇంగ్రిడియన్స్ ని ఉపయోగించి ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ రోజుల్లో మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రతి రోజు ఒక స్పూన్ పొడి తీసుకుంటే సరిపోతుంది. ఈ పొడిని ఒకసారి తయారుచేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది.

పొయ్యి వేలిగించి బాణలి పెట్టి దానిలో ఒక కప్పు ఆవిసే గింజలు వేసి వేగించాలి. ఆ తర్వాత అరకప్పు వేరుశనగ గింజలను వేసి వేగించాలి. ఆ తర్వాత 10 ఎండుమిరప కాయలను వేగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పచ్చి శనగపప్పు,ఒక స్పూన్ మినపప్పు, రెండు స్పూన్ల ధనియాలు, రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా వేగించాలి. వెగించిన వీటిని మిక్సీ జార్ లో వేయాలి.
Peanuts Health benefits in telugu
ఆ తర్వాత కొంచెం చింతపండు,ఒక స్పూన్ జీలకర్ర,7 వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసి వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు అన్నంలో కలుపుకోవచ్చు. లేదా ఇడ్లీ, అట్లు వంటి వాటిలో నలుచుకోవచ్చు. ఈ పొడిని తీసుకోవటం వలన అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
garlic Health benefits
కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. డయబెటిస్ ఉన్నవారు కూడా ఈ పొడిని తీసుకుంటే నియంత్రణలో ఉంటుంది. ఆవిసే గింజలు, వేరుశనగలో ఉన్న పోషకాలు ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. ఈ పొడిలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది.
Weight Loss tips in telugu
ఈ పొడిని ప్రతి రోజు అన్నంలో మొదటి ముద్దగా తింటే సరిపోతుంది. ఈ పొడిని తయారుచేసుకోవటం కూడా చాలా సులువు. కాబట్టి ఇలాంటి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ పొడిని తయారుచేసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.