Mahesh Babu ఒక్కడు సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో…?
Mahesh babu Okkadu Movie Details :మహేష్ బాబు ఒక్కడు సినిమా మొదట మహేష్ బాబు దగ్గరకు కాకుండా వేరే స్టార్ హీరో వద్దకు వెళ్ళింది. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం. కొన్ని సినిమాలు కొందరికోసమే తయారవుతాయి. అటు తిరిగి ఇటు తిరిగి వారి దగ్గరకే చేరతాయి. అలా వచ్చిన సినిమా హిట్ అయితే , వదులుకున్న వాళ్లకు అయ్యో ఛాన్స్ మిస్ అయ్యాము అని ఫీల్ అవుతారు.
తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వైరల్ అవుతోంది. ప్రభాస్ కోసం వచ్చిన సినిమా సూపర్ స్టార్ మహేష్ చేతికి చిక్కడం, బ్లాక్ బస్టర్ అవ్వడం గురించి వార్త సారాంశం.
వివరాల్లోకి వెళ్తే, సూపర్ స్టార్ మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మూవీ ఒక్కడు. ఇందులో చార్మినార్ సెట్ కోసం అప్పట్లో భారీగా ఖర్చుచేశారన్న వార్తలు వచ్చాయి.
హీరోగా మహేష్ బాబు చేస్తే, విలన్ గా ప్రకాష్ రాజ్ సమ ఉజ్జీగా సరిపోయాడు. భూమిక హీరోయిన్ గా నటించింది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ సాధించి పెట్టింది. దాంతో అర్జున్ సినిమా కూడా మహేష్, గుణశేఖర్ కాంబోలో వచ్చి హిట్ కొట్టింది. అయితే ఒక్కడు సినిమా మొదటగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ దగ్గరకు వెళ్ళింది.
కృష్ణంరాజు కి కూడా నచ్చి చేయమని సూచించారట. అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో కొన్ని మార్పులు చేయమని చెప్పడం, అలా చేస్తే మొత్తం సినిమా కథ దెబ్బతింటుందని భావించడం వలన మహేష్ దగ్గరకు వెళ్ళింది ఈ సినిమా కథ. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ మూవీ కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో రీమేక్ చేసారు.