Beauty TipsHealth

జుట్టుకి పట్టిస్తే చుండ్రు, జుట్టు రాలే సమస్య తగ్గి 3 రెట్లు వేగంగా జుట్టు పెరుగుతుంది

Besan Dandruff Home Remedies In telugu : చుండ్రు సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చుండ్రు సమస్యను అశ్రద్ద చేస్తే ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువ అవుతుంది. మన ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
besan
శనగపిండి:
ఒక కప్పు పెరుగులో నాలుగు స్పూన్ల శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని గడ్డలు లేకుండా కలపి మెత్తని పేస్ట్‌ గా చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను వెంట్రుకల మొదళ్ల నుంచి చివళ్ల దాకా బాగా పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. ఇలా కొన్ని వారాల పాటు చేసినట్లయితే చుండ్రు ఏ మందులూ లేకుండానే క్రమంగా తగ్గిపోతుంది.
fenugreek seeds
మెంతులు, పెరుగు పేస్ట్‌
మెంతులను ముందురోజు రాత్రి పెరుగులో నానబెట్టి ఉదయం మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకుని వెంట్రుకలకు బాగా పట్టించాలి. మెంతులు,పెరుగు చుండ్రు నివారణలో చాలా బాగా పని చేస్తాయి. పురాతన కాలం నుండి మెంతులు, పెరుగును జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. చుండ్రు సమస్యను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
henna leaf
గోరింటాకు
గోరింటాకును కోసిన వెంటనే రసం తీసి తలకు పట్టించినట్లయితే చుండ్రు నివారణ అవుతుంది.అందులో ఆమ్ల (పెద్ద ఉసిరి) పొడిని కూడా కలిపితే మరింత మంచి ఫలితం వస్తుంది. గోరింటాకు తెల్లజుట్టును నల్లగా మార్చటంలో కూడా సహాయపడుతుంది.

ఉసిరికపొడి
ఉసిరిక పొడిని అన్ని ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు. ఉసిరిక పొడిని తీసుకోని దానిలో నిమ్మరసం కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకుని తల కుదుళ్లకు పట్టించాలి. ఆ తర్వాత తల మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒక సారి చేసినట్లయితే తొందరగా తలలో ఉండే చుండ్రు నివారణ అవుతుంది.