Devotional

పూజ చేసే సమయంలో మనం తెలియక చేసే తప్పులు ఏమిటో తెలుసా?

pooja chese vidhanam : సాదారణంగా పూజ చేసే సమయంలో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. మనం ప్రతి రోజు దేవుడికి పూజ చేస్తూ ఉంటాం. మన కోర్కెలను దేవుడికి నివేదించటానికి సులువైన మార్గం పూజ. సాధారణంగా పూజ అనేది వారి కుటుంబ పద్ధతులు,ఆచారాలను బట్టి చేస్తూ ఉంటారు. పూజను ఒక పద్దతి ప్రకారం చేయాలి.

పూజ చేసే సమయంలో కొన్ని తప్పులు తెలియక చేస్తూ ఉంటారు. కామన్ గా అందరూ చేసే ఈ తప్పుల గురించి తెలుసుకొని సరిదిద్దుకుందాం. ముఖ్యంగా రెండు తప్పులను చేస్తూ ఉంటారు. ప్రతి రోజు దేవుడికి పువ్వులను పెడతాం. ఆ పువ్వులను మరుసటి రోజు తీసేసి కాలువలో కానీ పారుతున్న నీటిలో కానీ వేయాలి. అంతేకాని చెత్త బుట్టలో వేయకూడదు.

ఆలా చేస్తే మహా పాపం. ఎందుకంటే దేవుడికి పెట్టిన పువ్వులు చాలా పవిత్రమైనవి. అందువల్ల దేవుడికి పెట్టిన పువ్వులు మరియు వత్తులు లాంటి వాటిని కూడా నీటిలో నిమజ్జనం చేయాలి. ప్రతి రోజు కాలువకి వెళ్లి నిమజ్జనం చేయటం కుదరదు కాబట్టి ప్రతి రోజు తీసేసిన పువ్వులను ఒక కవర్ లో వేసి ఓ పక్కన పెట్టి మంగళవారం,శుక్రవారం కాకుండా పదిహేను రోజులకు ఒకసారి కానీ నెల రోజులకు ఒకసారి కానీ మీ వీలును బట్టి ఆ పువ్వులను కాలువలో నిమ్మజ్జనం చేయవచ్చు.

పూజ పూర్తీ అయ్యాక నైవేద్యం పెట్టి హారతి ఇస్తూ ఉంటాం. హారతి ఇచ్చాక రెండు నిముషాలు స్వామికి తినే సమయంగా ఉండటానికి దేవుడి గది నుండి బయటకు రావాలి. ఆ తర్వాతే దేవుడి దగ్గర ప్రసాదం తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే దేవుడి అనుగ్రహం తొందరగా దక్కుతుంది. అంతేకాక కుటుంబం సంతోషంగా ఆయుర్ ఆరోగ్యాలతో ఉంటారు.