వారంలో 2 సార్లు ఈ ఇడ్లీ తింటే చాలు విపరీతమైన ప్రోటీన్ లభిస్తుంది
Korrala Idli Health Benefits :కొర్రలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం మనలో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో చిరు ధాన్యాల మీద అవగాహన పెరిగి కొర్రలు, సామలు వంటి వాటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. మన శరీరానికి అవసరమైన పోషకాలు అన్ని కొర్రలలో సమృద్ధిగా ఉంటాయి.
కొర్రలతో ఇడ్లీ తయారు చేసుకుని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది. కొర్రలతో చేసిన ఇడ్లీలో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక బౌల్ లో అరకప్పు అటుకులు, ఒక కప్పు కొర్రలు, అర కప్పు పొట్టు తీయని మినప్పప్పు వేసి నీటిని పోసి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి.
ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తని పిండిగా రుబ్బాలి. ఈ పిండిని ఒక గిన్నెలో తీసుకొని మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయాలి. ఇలా వదిలేయడం వలన మంచి బ్యాక్టీరియా పెరిగి పిండిని పులిసేలా చేస్తుంది. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ మీగడ వేయాలి. ఆ తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, అరకప్పు కొబ్బరి తురుము, ఒక స్పూన్ దంచిన మిరియాల పొడి, 1/4 స్పూన్ ఇంగువ వేసి బాగా కలపాలి.
ఒక నిమిషం వేగాక ఈ కొబ్బరి తాలింపును పైన తయారు చేసుకున్న కొర్రల పిండిలో వేసి బాగా కలపాలి. ఈ పిండిని ఇడ్లీలుగా వేసుకొని తినాలి. ఈ విధంగా ఇడ్లీలు వారంలో రెండు సార్లు చేసుకొని తింటూ ఉంటే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. అలాగే పిల్లల్లో మేధాశక్తి తెలివితేటలు పెరుగుతాయి.
అలసట,నీరసం, నిస్సత్తువ వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ ఇడ్లీలను తినవచ్చు. మన ఆరోగ్యం బాగుండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కొర్రలు కూడా అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయి. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఇటువంటి ఆహారాలను తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.