2023 ధనస్సు రాశి ఫలితాలు శని మేలు చేస్తాడా? అదృష్టం ఏ రూపంలో వస్తుందో తెలుసా?

Dhanassu rasi phalalu 2023 :మూల 1,2,3,4 పాదాలు, పూర్వాషాఢ 1,2,3,4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం ధనస్సు రాశి కిందకు వస్తాయి. ధనస్సు రాశివారికి ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యం 1,అవమానం 5 ఉంటాయి. ధనస్సు రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. పనులు ఆలస్యం అయ్యి సహనానికి పరీక్ష అన్నట్టు ఉంటాయి.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా ఆప్త మిత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త నియంత్రణ ఉండటం మంచిది. ధనస్సు రాశివారు ఇచ్చే సలహాలు ఎదుటివారికి బాగా కలిసి వస్తుంది. అదే తమ విషయంలో కలిసి రాదు. దాంతో కాస్త ఆందోళనగా ఉంటారు.

దాంతో నిదానంగా నమ్మకం కూడా తగ్గిపోతుంది. పిల్లల వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఎవరికైనా మధ్యవర్తిత్వం చేసే సమయంలో జాగ్రత్తగా లేకపోతే నిందలు పడాల్సి రావచ్చు. ఆ సమయంలో చాలా ఓపికగా,తెలివిగా వ్యవహరించాయి. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండి మనస్సు గాయపరచకుండా మాట్లాడాలి.
అప్పుడే మీకు ఆనందంగా ఉంటుంది. శత్రువులపై మీదే పైచేయిగా ఉంటుంది.

అయితే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎటు నుంచి సమస్య వస్తుందో చెప్పలేం. ప్రతి చిన్న పనికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో వివాదాలు లేకుండా చూసుకోవాలి. వివాదాలు వస్తే ఇంటిలో ప్రశాంతత ఉండదు. ప్రతి పనియందు తెలియని అసంతృప్తి, ఎంత శ్రమించినా అందవలసిన ఫలము అందకపోవడం, నిరాశకు గురి చేస్తుంది.ఏలినాటి శని చివరి దశ కనుక పనులు ఆలస్యంగా పూర్తిచేస్తారు.

నమ్మిన వారే మోసం చేసే ఉద్దేశ్యంతో ఉన్నారనే విషయం తెలిసి చాలా బాధపడతారు. స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎదో తెలియని అశాంతి ఈ రాసివారిని వేధిస్తుంది. ప్రమోషన్స్ పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ నిజాయితి, మీ నైపుణ్యం నిరూపించు కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చును. ప్రెవేట్ ఉద్యోగం చేసేవారికి అస్తమాను స్దాన చలనం కలుగుతుంది. కోపం,ఆవేశంను అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు కాలయాపన చేయకుండా చదువు మీద దృష్టి పెట్టాలి.

విదేశాలలో చదవాలంటే చాలా కృషి చేయాలి. విద్యార్థులు శ్రీ హయగ్రీవ స్తోత్రం పారాయణ చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వ్యాపారం చేసేవారు ఏ నిర్ణయం తీసుకున్న ఒకటికి నాలుగు సార్లు అలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మౌనం కొన్ని సమస్యలకు పరిష్కారం కావచ్చు.

చెప్పుడు మాటల కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి. అందువల్ల సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళితే మంచిది. అతి మంచితనం, మోహమాటము కారణంగా ఎంత కృషి చేసినా కూడా రావలసిన ధనము, ఆదాయం రానందున మనోవేదన ఎక్కువ అవుతుంది. ప్రత్యేక శని సోత్ర పారాయణం, గోపూజ వల్ల మేలు జరుగును.