రాగి పాత్రలోని నీరు ఎక్కువగా తాగుతున్నారా… ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్న వారు…

Copper water side effects in Telugu :రాగి పాత్రలో నీరు సుమారు 8 గంటల పాటు నిల్వ ఉంచి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు రాగి పాత్రలో నీరు తాగితే అవి తీవ్రం అవుతాయి. అందువల్ల రాగి పాత్రలోని నీటిని తాగాలని అనుకున్నప్పుడు ఒకసారి ఆరోగ్య నిపుణుడుని సంప్రదించడం మంచిది.
Copper Water Bottle
గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు రాగి పాత్రలోని నీటిని తాగకూడదు. అలా తాగడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అందువల్ల ఈ సమస్యలు ఉన్న వారు ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకుని తాగితే మంచిది. రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను అసలు తినకూడదు.
gas troble home remedies
ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే రాగి పాత్రలో నీటిని తాగవచ్చు.కిడ్నీ లేదా గుండె సమస్యలు ఉన్నవారు కూడా ఈ నీటిని తాగే ముందు ఒక్కసారి వైద్యుణ్ని సంప్రదించడం మంచిది. రాగి పాత్రలో పాలు లేదా పాల ఉత్పత్తులు, పుల్లని పదార్థాలు ఎప్పుడు తీసుకోకూడదు.ఎందుకంటే రాగి పాత్రలో వీటిని ఉంచటం వలన విషపూరితంగా మారే అవకాశం ఉంది.
kidney problems
భోజనం చేసిన తర్వాత రాగి ఎక్కువగా ఉండే నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది.రాత్రి పడుకునే ముందు కూడా ఈ నీటిని తాగకూడదు. ఎందుకంటే నిద్రపై ప్రభావం పడుతుంది.కాబట్టి ఏ అనారోగ్య సమస్యలు లేనివారు రాగి పాత్రలో నీటిని తాగవచ్చు
Copper water benefits In Telugu
ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించి మాత్రమే రాగిపాత్రలో నీటిని తాగాలి. ఈ నీటిని ఉదయం పరగడుపున తాగితే జీర్ణ సంబంద సమస్యలు అసలు ఉండవు. అదే భోజనం చేసిన తర్వాత తాగితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.