నెమలి పించం ఇంటిలో ఉండవచ్చా… ఉంటే ఈ విషయం తెలుసుకోకపోతే నష్టపోతారు

Nemali Pincham facts : సాదారణంగా మనలో చాలా మంది నెమలి పించంను ఇంటిలో అలంకరణ కొరకు ఉపయోగిస్తారు. నెమలి భారత దేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు వాటి అందమయిన ఈకలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇటువంటి పొడావాటి ఈకలు నెమలికి మాత్రమే ఉంటాయి. నెమలి పించం చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

నెమలి పించం చూడగానే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. నెమలి పించానికి మన వేదాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీకృష్ణుడి రూపం నెమలి పించం లేకుండా.. పూర్తి అవదంటే అతిశయోక్తి కాదు. మన పురాణాల గ్రంధాల ప్రకారం నెమలి పించానికి ఆధ్మాత్మిక శక్తి ఉంది. అందుకే ఆధ్మాత్మికంగా నెమలిపించముకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తుంది.

మన చిన్నతనంలో నెమలి పింఛాన్ని పుస్తకాలలో పెట్టుకొనే వాళ్ళం. అప్పుడు సరదాగా పెట్టుకున్నప్పటికీ నెమలి పించం అనేక దోషాలను నివారిస్తుందని చాలా మందికి తెలియదు. నెమలి పించం డెకరేషన్ కే కాకుండా అనేక రకాల దోషాలను నివారిస్తుంది. అలాగే ఇంటిలో ఉండే వాస్తు దోషాలను నివారిస్తుంది. అయితే నెమలి పింఛాన్ని ఎలా ఉపయోగిస్తే దోషాలు నివారణ జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం.

ముఖ ద్వారం తలుపుకి ఎదురుగా నెమలి పించాన్ని పెడితే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆఫీస్ లో నెమలి పించాన్ని పెట్టుకుంటే మీ పనితీరు మెరుగుపడి ప్రశంసలు అందుకుంటారు. నెమలి పించం నెగిటివ్ ఎనర్జీ,వాస్తు దోషాలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

అందువల్ల ఇంటి గుమ్మానికి కొన్ని నెమలి ఈకలను వ్రేలాడదీస్తే నెగిటివ్ ఎనర్జీ,వాస్తు దోషాలు తొలగిపోతాయి. లాకర్ దగ్గర నెమలి పించాన్ని పెడితే డబ్బును ఎట్రాక్ట్ చేసి ధనం, శ్రేయస్సు పెరుగుతుంది. వాస్తు దోషాలు ఉన్నప్పుడు వాటిని తొలగించుకోవడానికి 8 నెమలి పించంలను తీసుకుని.. అన్నింటినీ కలిపి.. తెలుపు రంగు దారంతో కట్టాలి. అలా కట్టిన తర్వాత.. ఓం సోమాయ నమ: అని 108 సార్లు జపించాలి.

అలాగే శని దోషాలు ఉన్నప్పుడు మూడు నెమలి పించములు తీసుకుని నలుపు దారంతో కట్టాలి. ఆ తర్వాత కొంచెం వక్కపొడి చల్లి.. కొంచెం నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు ఓం శనేశ్వరాయ నమ: అని.. 21 సార్లు జపించాలి. ఇలా చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. బెడ్ రూంలో నెమలి పించం పెట్టుకోవడం వల్ల.. భార్యాభర్తల మధ్య అండర్ స్టాండింగ్ పెరగటమే కాకుండా తగాదాలు,గొడవలు వంటివి రావు.