వారంలో రెండు సార్లు ఈ నూనె రాస్తే తెల్ల జుట్టు సమస్య అనేది అసలు ఉండదు

White Hair Home Remedies in telugu :ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య అనేది వస్తుంది. దాంతో కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితం ఉండక చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. వాతావరణంలో కాలుష్యం, కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి కారణాలతో తెల్ల జుట్టు సమస్య వస్తుంది.

మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు జుట్టు తెల్లగా మారటం ప్రారంభం అవుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో ఉన్న కొన్ని వస్తువులతో చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అలాగే తెల్ల జుట్టు రాకుండా కూడా నివారించవచ్చు. ఇప్పుడు చెప్పే నూనెను వారంలో రెండు సార్లు జుట్టుకి రాస్తే సరిపోతుంది.

ఇలా చేయటం వలన మెలనిన్ ఉత్పత్తి పెరిగి తెల్లజుట్టు రాకుండా ఉంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు కొబ్బరి నూనె, ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ టీ పొడి, ఒక స్పూన్ శీకాయ పొడి, ఒక స్పూన్ కలోంజి సీడ్స్‌ పొడి వేసి పది నిముషాలు మరిగించి పొయ్యి ఆఫ్ చేసి… చల్లారక పల్చటి వస్త్రం సహాయంతో వడకట్టాలి.
Green Tea Brain Health Benefits
ఈ నూనెను ఒక సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను రాత్రి పడుకొనే ముందు జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి.. మరుసటి రోజు ఉదయం కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది.

ఈ విధంగా చేయటం వలన మెల‌నిన్ ఉత్పత్తి అద్భుతంగా పెరుగుతుంది.దాంతో జుట్టు త్వరగా తెల్ల బ‌డకుండా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. ఈ నూనెలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టుకి పోషణ అందిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.